Thursday, June 11, 2020

వీడియో: రెండు తలల దూడ జననం..!


మైలవరం(Mylavaram): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైలవరం నియోజకవర్గంలో రెడ్డి గూడెం మండలం రుద్రవరం గ్రామంలో రెండు తలల దూడ జన్మించింది. గ్రామానికి చెందిన గరికపాటి వెంకటేశ్వరరావు ఇంటిలో గేదె  రెండు తలల దూడకు గురువారం జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు రెండు తలల దూడ జననం చూసేందుకు తరలివస్తున్నారు. ప్రస్తుతం దూడ ఆరోగ్యవంతంగా ఉన్నది.
అయితే రెండు త‌ల‌ల  జంతువుల‌కు సంబంధించి అనేక మైన  మూఢ‌న‌మ్మ‌కాలు ప్రాచుర్యంలో ఉన్న‌ప్ప‌టికీ క‌వ‌ల‌లు పుట్టే ప్ర‌క్రియ‌లో చోటుచేసుకునే లోపాల కార‌ణంగా ఇలాంటి జీవులు జ‌న్మిస్తాయ‌ని నిపుణులు అంటున్నారు. వీటిని రెండు త‌ల‌ల ఉన్న జీవిగా ప‌రిగ‌ణిస్తున్నారు. ల‌క్ష‌ల సంవ‌త్స‌రాల కింద‌ట నుంచి ఈ విధంగా రెండు త‌ల‌ల జీవులు ఉనికి ఉన్న‌ట్టు అధ్య‌య‌నాలు పేర్కొంటున్నాయి. 120 మిలియ‌న్ సంవత్స‌రాల క్రితం రెండు త‌ల‌ల జీవి శిలాజం గురించిన ప‌లు వివ‌రాల‌ను 2007 లో బ‌యాల‌జీ లెట‌ర్స్ అనే జ‌ర్న‌ల్ ప్ర‌చురించ‌డం జ‌రిగింది. 

No comments:

Post a Comment