Wednesday, June 10, 2020

వనమా కుటుంబంపై కావాలనే ఆరోపణలు..!

  •  స్త్రీ-  శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్

మహబూబాబాద్: భద్రాద్రి -కొత్తగూడెం జిల్లా కు చెందిన గిరిజన మహిళపై కొంతమంది యువకులు దాడికి పాల్పడి తీవ్ర గాయాలు చేసిన సంఘటనపై జిల్లా ఎస్పీ విచారణ చేసి దోషులను అరెస్టు చేశారని , నిర్దోషులని వదిలేశారని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. గత నెలలో గిరిజన మహిళ ఆమెకు అన్యాయం జరిగిందని, తన వద్దకు వస్తే వెంటనే జిల్లా ఎస్పీని విచారించాలని ఆదేశించామని, ఎస్పీ నివేదిక ఇచ్చారని తెలిపారు. ఈ నివేదికలో కావాలని కొంతమంది మనమా కుటుంబాన్ని అభాసుపాలు చేయాలని, రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని సదరు గిరిజన మహిళలతో తప్పుడు ఆరోపణలు చేయించినట్లు వెల్లడైందని పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణలతో రాజకీయంగా వనమా కుటుంబంపై బురద చల్లే ప్రయత్నం చేశారని తెలిపారు.
గిరిజన మహిళ వనమా కుటుంబంపై ఆరోపించినట్లు అందులో ఎలాంటి వాస్తవాలు లేవని తెలిసిందన్నారు. తన దగ్గరకు ఏ మహిళ అన్యాయం జరిగిందని వచ్చిన వెంటనే విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెబుతానని ఈ సంఘటనలో కూడా అదేవిధంగా చేశానని పేర్కొన్నారు. పోలీసుల విచారణ అనంతరం నిజాలు బయటపడ్డాయని తెలిపారు. రాజకీయంగా వనమా కుటుంబం మీద చేసిన కుట్ర తప్ప వేరే ఏమీ లేదని స్పష్టమైందని చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని మహిళలకు పోలీసు వ్యవస్థ రక్షణ కవచంగా ఉందన్నారు. ప్రత్యేక టీంలు పెట్టి మహిళల భద్రతకు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కేసు విషయంలో పోలీసులు దోషులను పట్టుకున్నారని వారిపై కేసు నమోదైందని తెలిపారు. దోషులు కాకుండా రావాల నేర్పించిన వారిని నిర్దోషులుగా భావించి కేసు నుంచి తొలగించడం జరిగిందని పేర్కొన్నారు.

No comments:

Post a Comment