Sunday, June 21, 2020

బెజ‌వాడ గ్యాంగ్‌వార్ ... రౌడీషీట‌ర్ల‌కు వార్నింగ్‌..!

విజ‌య‌వాడ(Vijayawada):
విజ‌య‌వాడ‌లో ఇటీవ‌ల జ‌రిగిన వ‌రుస సంఘ‌ట‌న‌ల‌తో సంచ‌ల‌ న్మాత‌క‌మైన నేరాల విష‌య‌మై ఆదివారం న‌గ‌రంలోని రౌడీషీట‌ర్ల‌కు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వ‌హించారు. న‌గ‌రానికి కొత్త‌గా వ‌చ్చిన సీపీ బ‌త్తిన శ్రీ‌నివాసులు ఆధ్వ‌ర్యంలో నేరాల అదుపుతో పాటు, శాంతి భ‌ద్ర‌త‌ల‌పై పోలీసులు సీరియ‌స్‌గా దృష్టి సారించారు. నేరాల‌పై ఉక్కుపాదం మోపుతున్నారు. ఆదివారం న‌గ‌రంలో ఉన్న చిన్నాచిత‌క పెద్ద రౌడీల‌ను పిలిచించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అజిత్ సింగ్ న‌గ‌ర్‌, నున్న పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో పాత నేర‌స్తుల‌కు సీఐలు ల‌క్ష్మీనారాయ‌ణ‌, ప్ర‌భాక‌ర్ లు కౌన్సిలింగ్ ఇచ్చి, వారి నుంచి పూర్తి వివ‌రాలు రాబ‌ట్టారు. ఎక్క‌డ నివాసం ఉంటున్నారు? ఏం ప‌ని చేసి జీవిస్తున్నారో ఆరా తీశారు. 
అజిత్ సింగ్ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో 47 మంది రౌడీషీట‌ర్ల‌కు కౌన్సిలింగ్ ఇచ్చారు. న‌గ‌రంలో ఎక్క‌డైనా పాత నేర‌స్తులు ఇబ్బంది పెడుతున్నా, దాడులు చేసిన‌ట్టు తెలిసినా త‌మ దృష్టికి తీసుకురావాల‌ని సీఐలు విజ్ఞ‌ప్తి చేశారు. అసాంఘిక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డిన వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని సీపీ హెచ్చ‌రించారు. రౌడీషీట‌ర్లు అందిరితో క‌లిసిపోయి మంచిగా జీవ‌నం సాగించాల‌న్నారు. మంచిగా జీవిస్తున్న వారిని త‌మ దృష్టికి తీసుకువ‌స్తే అధికారుల‌తో చ‌ర్చించి రౌడీషీట్ ఎత్తివేసేలా కృషి చేస్తామ‌ని పోలీసులు చెప్పారు. 

గ్యాంగ్ వార్ ఘ‌ట‌న‌లో ఉలిక్కిప‌డ్డ న‌గ‌రం..!

బెజ‌వాడ‌లో ఇటీవ‌ల  భూ వివాదంలో పండు గ్యాంగ్‌తో త‌లెత్తిన ఘ‌ర్ష‌ణలో   రౌడీషీట‌ర్ సందీప్ మృతిచెందాడు. దీంతో ఒక్క‌సారిగా న‌గ‌రం ఉలిక్కిప‌డింది. ఈ నేప‌థ్యంలో పోలీసులు న‌గ‌రంలో ఏ చిన్న గొడ‌వ జ‌రిగినా అప్ర‌మ‌త్త‌వుతున్నారు. ఘ‌ర్ష‌ణ జ‌రిగిన రోజు నుంచి అజ్ఙాతంలోకి 10 మంది నిందితులు వెళ్లారు. క‌న్న‌బిడ్డ‌ను నేరాల‌వైపు ప్రోత్స‌హించిన కార‌ణంగా పండు త‌ల్లి పై ప‌డ‌మ‌ట పోలీస‌లు కేసు న‌మోదు చేసి రౌడీషీట్ ఓపెన్ చేశారు. 
గ్యాంగ్ వార్‌ను తీవ్రంగా ప‌రిగ‌ణించిన మాజీ సీపీ సీహెచ్ ద్వార‌కా తిరుమ‌ల‌రావు ఇరు గ్రూపుల‌కు చెందిన స‌భ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించారు. ప్ర‌శాంతంగా ఉన్న న‌గ‌రంలో కొంద‌రు రౌడీ మూఖ‌లు యువ‌కుల‌తో క‌లిసి అల‌జ‌డి రేప‌డాన్ని క్ష‌మించ‌రాని నేరంగా భావించి గ్యాంగ్‌వార్‌లో పాల్గొన్న కొంద‌రు యువ‌కుల‌పై న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ వేటు వేయాల‌ని నిర్ణ‌యించారు. 
విజ‌య‌వాడ న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో 417 మంది రౌడీషీట‌ర్లు ఉన్నారు. శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగించే నేర‌గాళ్లు 497 మంది ఉన్నారు. ఇప్ప‌టికే 7 గురిపైన న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ వేటు వేశారు పోలీసులు. గ్యాంగ్ వార్‌లో సందీప్ త‌ర‌పు పాల్గొన్న 11 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించామ‌ని డీసీపీ చెప్పారు. వారి నుంచి రెండు ప‌ట్టా క‌త్తులు, ఒక నేపాల్ క‌త్తి, రెండు రాడ్లు, క‌ర్ర‌, బేడ్లు, ఆరు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. 

మంగ‌ళ‌గిరినే గ్యాంగ్ వార్‌కు అడ్డా..!

ప్రఖ్యాతి గాంచిన పుణ్య‌క్షేత్ర‌మైన మంగ‌ళ‌గిరి చేనేత‌కు బ్రాండ్ ఇమేజ్ తెచ్చిన ప‌ట్ట‌ణం.. కానీ రానురాను హ‌త్యా రాజకీయాలు, రౌడీషీట‌ర్ల‌కు నిల‌యంగా మారింది. గ‌డిచిన ఏడేళ్ల‌లో మూడు కిరాయి హ‌త్య‌లు, వేర్వేరు నేరాల‌తో పాటు ప‌లుచోట్ల అల్ల‌ర్లు సృష్టించ‌డానికి , కోట్ల విలువ చేసే భూముల కబ్జాకు మంగ‌ళ‌గిరిలో ఉన్న రౌడీషీట‌ర్లు బ్లేడ్ బ్యాచ్‌ని, గంజాయి బ్యాచ్‌ని వాడుకుంటున్నారు.
2007 లో పోలీసుల‌కు సైతం ఐపీ పెట్టి కాల్వ‌లోకి కారును తోసేసి చ‌నిపోయిన‌ట్టు సృష్టించిన ప్ర‌ముఖ నేర‌స్తుడి ద‌గ్గ‌ర్నుంచి గంజా యి వంటి మ‌త్తు ప‌దార్థాల కోసం యాచ‌కుల‌ను సైతం వ‌ద‌ల‌కుండా దాడుల‌కు పాల్ప‌డే బ్లేడ్ బ్యాచ్‌, రౌడీషీర్లు మంగ‌ళ‌గిరి చుట్టుప‌క్క‌ల ప్రాంతంలో నేర‌స్తుల‌ను కూడ‌గ‌ట్టి స‌మావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. 
మంగ‌ళ‌గిరి శివారు ప్రాంతాలైన పాత‌రైల్వేగేటు ప్రాంతంతో పాటు హాయ్‌ల్యాండ్ వెనుక ప్రాంతం, అమ‌రావ‌తి టౌన్‌షిప్‌, చిన‌కాకాని గ్రామానికి , రైల్వే ట్రాక్ మ‌ధ్య తాడేప‌ల్లిలోని మ‌హానాడు, సుంద‌ర‌య్య న‌గ‌ర్‌, పుష్క‌ర‌ఘాట్లు, ఐఓసీ ఎదురుగా ఉన్న వెంచ‌ర్లు, విజ‌య‌వాడ క్ల‌బ్ వెనుక ఉన్న కృష్ణాన‌ది త‌దిత‌ర ప్రాంతాల్లో స్థ‌లాలు మారుస్తూ స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. సందీప్ హ‌త్య ఘ‌ట‌న ముందు కుంచ‌న‌ప‌ల్లి గ్రామంలో స‌మావేశం జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. మొత్తంగా ప్ర‌స్తుతం మంగ‌ళ‌గిరి రౌడీషీట‌ర్ల అడ్డాగా మారింద‌నే ప్ర‌చారం వెలువ‌డుతుంది. 

గుంటూరు-విజ‌య‌వాడ‌లో వెయ్యిమంది రౌడీషీట‌ర్లు..!

గుంటూరు, విజ‌య‌వాడ న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌రేట్ ప‌ర‌ధిలో వెయ్యి మంది రౌడీషీట‌ర్లు ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ న‌గ‌రాల్లో ఏ కేట‌గిరీ వారిపై నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం..వీరి క‌ద‌లిక‌ల‌పై క‌మిష‌న‌ర్ టాస్క్‌ఫోర్స్ , సంబంధిత స్టేష‌న్ల అధికారులు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్నాయ‌ని న‌గ‌ర వాసులు అంటున్నారు. 
ముఖ్యంగా విజ‌య‌వాడ న‌గ‌రంలో ప‌లుకుబ‌డి క‌లిగిన రౌడీషీట‌ర్లు చాలా మంది నెల‌ల త‌ర‌బ‌డి సంబంధిత స్టేష‌న్ల‌కు రాక‌పోయినా పోలీసులు స్పందించ‌డం లేదు. ఏ -కేట‌గిరీ రౌడీషీర్ల విభాగంలో ఉన్నపెద్ద రౌడీ ఈ ఏడాది జ‌న‌వ‌రి నుంచి ప‌ట‌మ‌ట స్టేష‌న్‌కు రాక‌పోయినా ప‌ట్టించుకోలేదనే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. నేరాభియోగాలు ఎదుర్కొంటూ రౌడీషీట్ ఉన్న వ్య‌క్తి చాలా కాలం నుంచి స్టేష‌న్‌కు ఎందుకు రావ‌డం లేద‌న్న దానిపై క‌నీసం దృష్టి కూడా పెట్ట‌లేదు.ఇన్నాళ్లు రాకుండా ఉండ‌టానికి ఏమైనా మిన‌హాయింపు తీసుకున్నారా..? అన్న విష‌యాన్ని పోలీసులు బ‌య‌ట‌పెట్ట‌డం లేదు. ఈ స‌మ‌యంలో ఎక్క‌డ ఉన్నారు? ఎవ‌రిని క‌లిశారు? అన్న అంశాల‌పై  పోలీసులు స‌మాచారం బ‌య‌ట‌కు రానివ్వ‌డం లేదు. 

No comments:

Post a Comment