Thursday, June 4, 2020

క‌న్నీరు తెప్పిస్తున్న ఫొటో..మృగాళ్ల వినోదానికి బ‌లైన ప‌సికందు ఏనుగు..!

కేర‌ళ:
 
కేర‌ళ‌లోని మ‌న్న‌క్కాడు లో ఒక గ‌ర్భంతో ఉన్న ఏనుగును ట‌పాకాయ‌లుకూర్చిన పైనాపిల్‌ను ఆహారంగా పెట్టి చంపిన వార్త యావత్తు ప్ర‌పంచాన్ని క‌లిచివేసింది..ఆగ్ర‌హానికి కూడా దారితీసింది. ఈ విష‌య‌మై ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ముగ్గురు అనుమానితుల‌ను అదుపులోకి తీసుకొని కేసును సీరియ‌స్‌గా తీసుకుందా ప్ర‌భుత్వం.  
 ఈ ప్ర‌పంచంలో బాధ‌ను, సంతోషాన్ని, కోపాన్ని మాట‌లు ద్వారా చెప్పుకునే ఒకే ఒక వ్య‌క్తి మ‌నిషి. స‌ర్వ‌లోకంపై మ‌నిషికి శాసించే ల‌క్ష‌ణాల‌ను భ‌గ‌వంతుడు ఇచ్చాడు. ఒక్క శాసించ‌డ‌మే కాదు..ప్ర‌కృతిని, జీవ‌రాసుల‌ను ప్రేమించ‌డం కూడా భ‌గ‌వంతుడు నేర్పాడు. కానీ కొంత మంది మ‌నిషి రూపంలో ఉన్న మృగాళ్లు పైశాచికాన‌దం కోసం మూగ‌జీవాల‌ను ఎన్ని హింస‌ల‌కు గురిచేస్తున్నారో వార్త‌ల్లోనూ, వీడియోల్లోనూ,ఫొటోల్లోనూ చూస్తూనే ఉన్నాం. రాను రాను మ‌నిషి మ‌నుగ‌డ కూడా ప్ర‌శ్నార్థ‌కంగా మారిన ప‌రిస్థితుల్లోనూ మంచి ఏదో, చెడు ఏదో తెలుసుకోలేని ద‌య‌నీయ ప‌రిస్థితుల్లో బ్ర‌తుకుతున్నాం. 
కేర‌ళ‌లోని నీలంబూర్ అట‌వీ ప్రాంతం నుంచి వ‌చ్చిన ఒక ఏనుగు అది. సుమారు 14-15 సంవ‌త్స‌రాల వ‌య‌స్సుతో ఉండి గ‌ర్భంతో ఉన్న‌ట్టు అట‌వీ శాఖ అధికారులు తెలియ‌జేశారు. 
పైనాపిల్ బాంబు దాడికి ఏనుగు వెల్లియార్ న‌దిలో మూడు రోజులుగా ఉండి బ‌య‌ట‌కు రాలేక‌పోయింది. ఏనుగు ద‌వ‌డ‌ల రెండు వైపులా బాగా గాయాలై దాని దంతాల‌న్ని కూడా కోల్పోయింది. అట‌వీ శాఖ అధికారులు పోస్టుమార్టం నిమిత్తం ప‌రిశీల‌న చేయ‌గా గ‌ర్భంలో ఉన్న ప‌సికందు పేగుబంధంతోనే మృతి చెంది ఉంది. 
పంది ట‌పాకాయ అంటే..?
కేర‌ళ‌లోని అడ‌వి జంతువులు పొలాల్లోకి రాకుండా అడ్డుకునేందుకు పైనాపిల్ లేదా మాంసంలో ముడి పేలుడు ప‌దార్థాలు పెట్టే ప‌ద్ధ‌తికి కేర‌ళ స్థానిక నిఘంటువులో స్థానం క‌ల్పించారు. దానిని మ‌ల‌యాళంలో "ప‌ని ప‌డాకం" అంటారు. అంటే "పంది ట‌పాకాయ" అని అర్థం. 
ఈ ట‌పాకాయ‌ల‌ను స్థానికంగా దొరికే పేలుడు ప‌దార్థాల‌తో లేదంటే పండుగ స‌మ‌యాల్లో ఉప‌యోగించే ట‌పాకాయ‌ల నుంచి తీసి త‌యారు చేస్తారు. పేలుడు ప‌దార్థాలు, ర‌క‌ర‌కాల ఉచ్చులు ఉప‌యోగించ‌డం ఒక్క కేర‌ళ‌కే ప‌రిమితం కాద‌ని, భార‌త‌దేశ‌మంత‌టా అది ఉంద‌ని వ‌న్య‌ప్రాణి నిపుణులు చెబుతున్నారు. 
ఇలాంటి ఘ‌ట‌న‌లు ఎన్నో..?
18 ఏళ్ల కింద‌ట ఇలాంటి ఘ‌ట‌నే జ‌ర‌గ‌డంతో ఒక మ‌గ ఏనుగు నోట్లో తీవ్ర గాయాలు అయ్యాయి. అప్పుడు డాక్ట‌ర్ చీర‌న్ దానికి ఆప‌రేష‌న్ చేశారు. ఆ ఆప‌రేష‌న్ స‌మ‌యంలో సీనియ‌ర్ ప‌శువైద్యుడు ప్రొఫెస‌ర్ కేసీ ప‌నిక్కెర్‌, డాక్ట‌ర్ పీబీ గిరిదాస్ ఆ ఏనుగును మ‌త్తుమందు ఇచ్చి చీర‌న్‌కు స‌హ‌క‌రించారు. 
ఇటీవ‌ల ఏప్రిల్‌లో కూడా కొల్లం జిల్లాలోని పున‌లూర్ అట‌వీ ప్రాంతంలో ప‌థ‌న‌పురం ద‌గ్గ‌ర ఒక 9 ఏళ్ల మ‌గ ఏనుగు పిల్ల ఈ ట‌పాకాయ‌ల బారిన ప‌డింది. 
ఈ పేలుడు ప‌దార్థాల‌ను సైలెంట్ కిల్ల‌ర్స్ అంటారు. తుపాకీల‌తో కాల్పులు జ‌రిపితే గార్డులు ఆ శ‌బ్ధం వ‌చ్చిన వైపు వెళ్లి వాళ్ల‌ను ప‌ట్ట‌కుంటారు. అందుకే ఇలాంటి సైలెంట్ కిల్ల‌ర్స్ వ‌ల్ల వారి గురించి ఎవ‌రికీ తెలీయ‌కుండా ఉంటుంది. కేర‌ళ‌లోనే కాదు ఇది దేశ‌మంత‌టా జ‌రుగుతోంద‌ని వైల్డ్ లైఫ్ ఫ‌స్ట్ అనే స్వ‌చ్ఛంద సంస్థ‌కు చెందిన ప్ర‌వీణ్ బార్గ‌వ్ తెలిపారు. 

No comments:

Post a Comment