Wednesday, June 24, 2020

70 మంది క‌రోనా రోగులు ఏమ‌య్యారు?

ముంబాయి(Mumbai):
దేశంలో  మ‌హారాష్ట్ర క‌రోనా కేసుల సంఖ్య‌ పెర‌గ‌డంలో ముందున్న రాష్ట్రంగా వార్త‌ల్లోకి ప్ర‌తిరోజూ ఎక్కుతున్న విష‌యం ప్ర‌తిఒక్క‌రికీ తెలిసిందే. అయితే ఇదే విష‌యంలో అధికారులు త‌ల‌లు ప‌ట్టుకునే స‌మ‌స్య వ‌చ్చిప‌డింది. ముంబాయి లో 70 మంది క‌రోనా రోగులు అదృశ్య‌మ‌య్యార‌ట‌. త‌మ రికార్డుల్లో ఆ రోగుల ఆచూకీ ల‌భించ‌డం లేద‌ని బృహ‌న్ ముంబాయి కార్పొరేష‌న్ (బీఎంసీ) వెల్ల‌డించింది. వారిని గుర్తించేందుకు పోలీసుల స‌హాయం కోరింది.  వైర‌స్ సోకిన రోగుల‌ను సంప్ర‌దించాల‌ని ప్ర‌య‌త్నించ‌గా అనేక మంది ఆచూకీ ల‌భించ‌క‌పోవ‌డంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. రోగుల ఫోన్ నెంబ‌ర్లు, ఇంటి చిరునామా త‌ప్పుగా ఇవ్వ‌డం వ‌ల్లే ఇలా జ‌రిగిన‌ట్టు బీఎంసీ తెలిపింది. త‌ప్పిపోయిన వారి జాబితాను ప‌రిశీలించ‌గా వారంతా ఉత్త‌ర ముంబాయిలోని మ‌లాడ్ ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. కొవిడ్‌-19 కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో మ‌లాడ్ ఏరియా ఒక‌టి. ఇవి చ‌ద‌వండి: రెండు ద‌శాబ్దాల పాటు క‌రోనా మ‌నుగ‌డ‌..!
ఈ విష‌యంపై మ‌హారాష్ట్ర క్యాబినెట్ మంత్రి ముంబాయి గార్డియ‌న్ మంత్రి అస్లామ్ షేక్ మాట్లాడుతూ..ఔను కొంద‌రు క‌రోనా రోగుల ఆచూకీ ల‌భించ‌డం లేదు. కానీ వారు పారిపోలేదు. బాధితుల ఫోన్ నెంబ‌ర్లు, చిరునామాలు న‌మోదు చేసుకునే క్ర‌మంలో పొర‌పాటు జ‌రిగి ఉండ‌వ‌చ్చు. రోగుల‌ను గుర్తిస్తాం.పేషెంట్ల కుటుంబీకులు, వారితో సంబంధం ఉన్న వాళ్ల వివ‌రాలు తెలుసుకొని త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించేలా సూచిస్తాం. బాధితుల చిరునామాల‌లో పేర్కొన్న చాలా ప్రాంతాలు మురికివాడ‌ల‌కు చెందిన‌వే. ఆచూకీ ల‌భించని వారిలో వ‌ల‌స కార్మికులు ఉంచొచ్చు. అందులో కొంద‌రు కోలుకొని వెళ్లిపోయిన‌వారు ఉండే అవ‌కాశం కూడా ఉంది. అదృశ్య‌మైన రోగుల‌ను గుర్తించ‌డంలో బీఎంసీ త‌మ స‌హాయం కోరిన‌ట్టు ముంబాయి పోలీసు ప్ర‌తినిధి, డిప్యూటీ క‌మిష‌న‌ర్ ప్ర‌ణ‌య్ అశోక్ ధృవీక‌రించారు. త‌ప్పిపోయిన రోగుల జాబితాను బీఎంసీ పోలీసుల‌కు అందించింది. సంబంధిత వార్డు అధికారులు, పోలీసులు పేషెంట్ల వివ‌రాలు సేక‌రించేందుకు క‌లిసి ప‌నిచేస్తున్నారు. అని వెల్ల‌డించారు. ముంబాయిలో పాజిటివ్ కేసులు 70,000 వేల‌కు చేర‌వుతున్నాయి. దాదాపు 400 మంది మృతి చెందారు. 

రాందేవ్ బాబా  క‌రోనా మందు ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు ఆపండి:ఆయుష్ మంత్రిత్వ‌శాఖ‌

న్యూఢిల్లీ(Newdelhi): క‌రోనిల్‌, శ్వాసారి వ‌టి అనే రెండు మందుల‌ను క‌రోనా చికిత్స కోసం త‌యారుచేశామ‌ని యోగా గురు రాందేవ్ కు చెందిన సంస్థ పంతంజ‌లి మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. కోవిడ్ -19 కి ఈ  మందుల‌తో ఆయుర్వేద చికిత్స చేయొచ్చ‌ని ప‌తంజ‌లి చెబుతోంది. హ‌లో సార్‌..హోంక్వారంటైన్ నేను..!
ప‌తంజ‌లి యోగాపీఠ్ హ‌రిద్వార్ లో ఉన్న త‌మ ప్ర‌ధాన కార్యాల‌యంలో క‌రోనా రోగుల‌పై క్లినిక‌ల్ ట్ర‌యిల్స్ నిర్వ‌హించ‌గా ఇది 100 శాతం సానుకూల ప్ర‌భావం చూపించింద‌ని ఆ సంస్థ చెప్పింది. అయితే, ఆయుష్ మంత్రిత్వ శాఖ మాత్రం ఆ ఔష‌ధ ప్ర‌క‌ట‌ల‌ను ప్ర‌స్తున్నానికి ఆపేయాల‌ని సూచించింది. 
ఈ సంద‌ర్భంగా  ఆయుష్ మంత్రిత్వ శాఖ మీడియా ద్వారా తెలుసుకొని .."ఆ ఔష‌ధాల వివ‌రాలు అందించాల‌ని ప‌తంజ‌లి సంస్థ‌ను కోరిన‌ట్టు ఏఎన్ ఐ వార్తా సంస్థ తెలిపింది. ఔష‌ధాల‌ను నిశితంగా ప‌రిశీలించేవ‌ర‌కూ వాటి గురించి ప్ర‌క‌ట‌న‌లు, ప్ర‌చారం ఆపివేయాల‌ని ఆయుష్ మంత్రిత్వ‌శాఖ ఆ సంస్థ‌ను కోరింద‌ని చెప్పింది. ఆయుష్ మంత్రిత్వశాఖ త‌న ప్ర‌క‌ట‌న‌లో.. హ‌రిద్వార్‌లోని ప‌తంజ‌లి ఆయుర్వేదిక్ లిమిటెడ్ కోవిడ్‌-19 కు ఆయుర్వేద మందుల‌ను త‌యారు చేసిన‌ట్టు మీడియా ద్వారా తెలిసింది. ఆ సంస్థ వాద‌న‌లో వాస్త‌వాలు, వారు చెబుతున్న శాస్త్రీయ అధ్య‌య‌నం గురించి మంత్రిత్వ శాఖ‌కు ఎలాంటి స‌మాచారం లేదు" అని తెలిపింది. 

రాందేవ్ బాబా ఏం అన్నారు?

"ఈ మందు ట్ర‌య‌ల్స్ లో 280 మంది రోగులు పాల్గొన్నారు. వారంద‌రూ క‌రోనా వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. రోగుల‌పై మందును ప‌రీక్షించేందుకు అవ‌స‌ర‌మైన అనుమ‌తులు మేం ముందే తీసుకున్నాం. అని రాందేవ్ చెప్పారు. ప‌తంజ‌లి రీసెర్చ్ సెంట‌ర్‌, ఎన్ ఐఎంఎస్‌(నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌, జైపూర్‌) సంయుక్త కృషితో ఈ మందులు త‌యారు చేశామ‌ని రాందేవ్ చెప్పారు. ఈ మందును మూడు నుంచి ఏడు రోజులు ఉప‌యోగిస్తే, క‌రోనా రోగి పూర్తిగా కోలుకుంటారు. 69 శాతం మంది మూడు రోజుల్లో, 100 శాతం మందిఏడు రోజుల్లో కోలుకోవ‌డం మేం చూశాం." అన్నారు.  

ఎక్క‌డ..? ఎలా ..? ప‌రీక్షించారో చెప్పండి: ఆయుష్‌

ప‌తంజ‌లి ఆయుర్వేద లిమిటెడ్ తాము త‌యారు చేసిన మందు పేరు, అందులో ఏమేం ఉప‌యోగించార‌న్న వివ‌రాలు కూడా అందించాల‌ని ఆయుష్ శాఖ కోరింది. దానితో పాటు ఔష‌ధంపై ఎక్క‌డ‌? ఏ ఆస్పత్రిలో అధ్య‌య‌నం జ‌రిగింది? ఆ స‌మయంలో ఎలాంటి ప్రొటోకాల్ పాటించారో చెప్పాల‌ని అడిగింది. న‌మూనా ప‌రిమాణం ఎంత‌, దానికి ఇన్‌స్టిట్యూష‌న‌ల్ ఎథిక్స్ క‌మిటీ నుంచి క్ల‌యిరెన్స్ ల‌భించిందా?, సిటీఆర్ై రిజిస్ట్రేష‌న్‌, ఈ అధ్య‌యానికి సంబంధించిన డేటా ఎక్క‌డ ఉందో చెప్పాల‌ని కూడా కోరింది. ఇవ‌న్నీ విచారించే వ‌ర‌కూ ఈ ఔష‌ధానికి సంబంధించిన ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌ల‌ను నిలిపివేయాల‌ని ఆయుష్ శాఖ స్ప‌ష్టంగా చెప్పింది. దాంతో పాటు ఉత‌ర్తాఖండ్ ప్ర‌భుత్వ లైసెన్సింగ్ అథారిటీ ని ఈ ఔష‌ధానికి సంబంధించిన లైసెన్స్ కాపీ ఇవ్వాల‌ని కోరింది. ఉత్ప‌త్తిని ఆమోదించ‌డానికి సంబంధించిన వివ‌రాలు కూడా అందించాల‌ని చెప్పింది. 

No comments:

Post a Comment