Thursday, June 11, 2020

కరోనా సంక్షోభం: పేదరికంలోకి మరో4.9 కోట్లు మంది

  • ఐక్యరాజ్యసమితి హెచ్చరిక
న్యూయార్క్: కరోనా సంక్షోభంతో ప్రపంచంలో ఈ ఏడాది అదనంగా మరో 4.9 కోట్ల మంది తీవ్ర పేదరికంలోకి జారుకుంటారని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిణామం ఆహార భద్రత పై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. అంతర్జాతీయ ఆహార భద్రత కోసం అన్ని దేశాలు సత్వరం నింపుకోవాలని ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియా గుటెరస్ పిలుపునిచ్చారు. సభ్య దేశాలు తక్షణమే చర్యలు చేపట్టని పక్షంలో అంతర్జాతీయ ఆహార అత్యవసర పరిస్థితి ఏర్పడి కోట్లాది పిల్లలు వయోజనుల పై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.  ప్రపంచ జనాభా 780 కోట్ల మందికి పైగా ప్రజలు ఆకలి తీర్చేందుకు తగినంత ఆహారం ప్రపంచం వద్ద ఉందని అయినా ఇప్పుడు 82 కోట్ల మందికి పైగా ఆకలితో అలమటిస్తున్నారని గుటెరస్ అన్నారు.ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల మంది చిన్నారులకు ఆహారం అందుబాటులో లేదని ఐదుగురు పిల్లలు లో ఒకరు కుధ్బాద అనుభవిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

మన ఆహార ప్రభుత్వాలు విఫలం కాగా, కొవిడ్-19 మహమ్మారి పరిస్థితులను మరింత దిగజార్చుతుందని ఆహార భద్రతపై ఐక్యరాజ్యసమితి విధానంపై గుటెరస్  మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పలు దేశాల్లో తగినన్ని ఆహార నిల్వలు ఉన్నా, ఆహార సరఫరా వ్యవస్థ లో ఎదురవుతున్నాయని చెప్పుకొచ్చారు. వైరస్ మహమ్మారి నిరోధానికి ప్రపంచ దేశాలు కార్యాచరణకు పూనుకోవాలని అన్నారు. ఆహార భద్రత కొరవడిన దేశాలకు ఆహారము అందుబాటులోకి తీసుకు వచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.చిన్నారులకు పోషకాహారం అందుబాటులో ఉంచాలన్నారు.

భారత్ తో చర్చలు జరుపుతున్నాం: చైనా తాజా ప్రకటన

న్యూఢిల్లీ: భారత్ తో జరుగుతున్న చర్చలపై తాజా ప్రకటన చైనా దేశం చేసింది. రెండు దేశాలు దౌత్య, సైనిక మార్గాల ద్వారా సంబంధిత అంశాలపై సుహృధ్భావ వాతావరణంలో అర్థవంతమైన చర్చలు జరుగుతున్నాయని తెలిపింది. 
రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది అంటూ చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చునైంగ్ ను ఉటంకిస్తూ ఆ దేశానికి చెందిన గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఈ నెల 6న తూర్పు లద్ధాఖ్ లోని చుసుల్ మోల్డో ప్రాంతంలో సైనిక కమాండర్ స్థాయిలో భారత్ కమాండర్లు స్థాయిలో భారత్-చైనాల మధ్య 5 గంటల పాటు చర్చలు జరిగాయి. నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తతలను తగ్గించేందుకు శాంతిని నెలకొల్పేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. సరిహద్దు సమస్య పరిష్కారం విషయంలో తమ మధ్య భేదాన్ని వివాదాలు గా మారకుండా చూడాలన్నా ఏకాభిప్రాయానికి వచ్చారు. వారాంతంలో బెటాలియన్ కమాండర్ స్థాయి మేజర్ జనరల్స్ స్థాయిలో చర్చలు జరుగుతాయని తెలిపింది. చర్చలు అర్థవంతంగా సాగుతుండటంతో చైనా సైన్యం రెండున్నర కిలోమీటర్లు వెనక్కి వెళ్ళింది.గాల్వన్ ప్రాంతంతో పాటు మరో నాలుగు చోట్ల చైనా సైన్యం రెండున్నర కిలోమీటర్ల వెనక్కి వెళ్ళింది. భారత సైన్యం కూడా కొంత మేర వెనక్కు వచ్చింది.

No comments:

Post a Comment