Tuesday, June 9, 2020

అతని ట్రాప్ లో 200 మంది యువతులు

  • ప్రేమ పేరుతో వల-ఆపై బెదిరింపులు డబ్బులు వసూలు
  • శారీరిక వాంఛ తీర్చాలంటూ.. వేధింపులు
  • వరంగల్ జిల్లాలో ఓ యువకుడి నిర్వాకం
నల్గొండ(Nalgonda): అమాయక యువతులే అతని టార్గెట్. సోషల్ మీడియా సాయంతో వలపన్నడం, ఆ యువతుల తో చాటింగ్ చేసి ప్రేమలోకి దింపడం, ఆ తర్వాత వారి ఫోటోలు ,వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ.. బెదిరింపులకు పాల్పడటం. ఈ క్రమంలో కొందరు యువతులు వద్దనుండి డబ్బులు వసూలు చేస్తూ, మరికొందరు మాత్రం శారీరక వాంఛ తీర్చాలని టార్చర్ పెట్టేవాడు.
ఎట్టకేలకు షీ టీమ్ కు చిక్కి..
నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట కు చెందిన అఖిల్ అలియాస్ చందు.. సికింద్రాబాద్ అడ్డగుట్ట లోని ఒక హోమ్ కేర్ సెంటర్లో వార్డు బాయ్ గా పని చేసేవాడు. అక్కడ పనిచేస్తున్న క్రమం లో ఉద్యోగం  కోసం సిటీకి వచ్చిన యువతులను మెల్లగా పరిచయం చేసుకొని వారి ఫోన్ నెంబర్లు తీసుకునేవాడు.
సోషల్ మీడియా ద్వారా ప్రేమిస్తున్నానంటూ.. చాటింగ్ వీడియో కాల్స్ చేసి వారి ఫోటోలను సేకరించేవాడు. అలా సేకరించిన ఫోటోలను ఫేస్బుక్లో పెడతానంటూ బెదిరిస్తూ డబ్బులు ఇవ్వమని మరికొందరిని కోరిక తీర్చాలని టార్చర్ పెట్టేవాడు.
అతని ఫోన్ చెక్ చేయగా 200 మంది యువతులు ఫోన్ నెంబర్లు ఉన్నాయని, అతని ట్రాప్లో పడినట్లు గుర్తించామని తెలిపారు. ఇతను చర్యలతో విసిగిపోయిన నల్గొండ జిల్లాకు చెందిన ఓ అమ్మాయి ధైర్యంగా షీ టీమ్ ను సంబంధించిదని  తెలిపారు. షీ టీం మాటువేసి పట్టుకోవడంతో అతను బండారం బయట పడిందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఆ తనపై ఇంతకుముందు కేసులు ఉన్నాయని, తప్పించుకొని తిరుగు తున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. అలాంటి మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి వారి ఉచ్చులో ఎవరైనా ఉంటే యువతులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఎస్పి సూచించారు.

No comments:

Post a Comment