Saturday, June 13, 2020

అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్న 19 మందికి క‌రోనా..!

సంగారెడ్డి(Sangareddy) :
జిల్లాల్లోని జ‌హీరాబాద్‌లో ఒకే కుటుంబానికి చెందిన 19 మందికి క‌రోనా సోక‌డం క‌ల‌క‌లం రేపుతోంది. జ‌హీరాబాద్‌కు చెందిన 55 ఏళ్ల మ‌హిళ ఈ నెల 9న  హైద‌రాబాద్‌లోని ప్రైవేటు ఆసుప‌త్రిలో అనారోగ్య ల‌క్ష‌ణాల‌తో చికిత్స పొందుతూ మృతి చెందింది. అదే రోజు రాత్రి జ‌హీరాబాద్‌లోని స‌ద‌రు మ‌హిళ‌కు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. ఆ మ‌రుస‌టి రోజు సాయంత్రానికి మృతురాలి క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన వైద్య ఆరోగ్య శాఖ‌, మున్సిప‌ల్ అధికారులు మృతురాలికి ద‌గ్గ‌ర‌గా ఉన్న కుటుంబీకులు, బంధువులను గుర్తించిన మిర్జాపూర్‌(బి) ఐలోలేష‌న్ కేంద్రానికి త‌ర‌లించారు. 
25 మంది న‌మూనాల‌ను ప‌రీక్ష‌ల‌కు పంప‌గా శుక్ర‌వారం రాత్రి 19 మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయ్యింది. క‌రోనా సోకిన వారిలో చిన్నారులు, మ‌హిళ‌లు, పురుషులు ఉన్నారు. పాజిటివ్‌గా వ‌చ్చిన వారిని సంగారెడ్డి లోని జిల్లా ఆసుప‌త్రికి త‌ర‌లించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా మ‌హిళ అంత్య‌క్రియ‌ల్లో సుమారు 40 మంది పాల్గొని ఉంటార‌ని  అధికారులు అంచ‌నా వేస్తున్నారు. వారంద‌రినీ గుర్తుంచేందుకు వైద్య ఆరోగ్య శాఖ‌, మున్సిప‌ల్ అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టారు. దీంతో కోవిడ్ పాజిటివ్ వ‌చ్చిన ప్రాంతాన్ని అధికారులు రెడ్‌జోన్‌గా ప్ర‌క‌టించి రాక‌పోక‌ల‌పై పూర్తిగా నిషేధం విధించారు. ప‌ట్ట‌ణంలో ఒకేసారి క‌రోనా కేసుల సంఖ్య పెర‌గ‌డంతో ప్ర‌జ‌ల్లో  భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి. అధికార యంత్రాంగం, పోలీసులు ప్ర‌త్యేక దృష్టి సారించి వైర‌స్ నివార‌ణ‌కు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు. 
10 రోజుల్లో  1,593 కేసులు..!
లాక్‌డౌన్ స‌డ‌లింపుల త‌ర్వాత రాష్ట్రంలో క‌రోనా విజృంభిస్తోంది. గ‌త నెల చివ‌రి వారంలో 844 కేసులు న‌మోదైతే,  ఈ నెల తొలివారం రోజుల్లో 952 కేసులు న‌మోద‌య్యాయి. ఈ వారంలోని 5 రోజుల్లోనే 834 కేసులు వ‌చ్చాయి.  మొత్తంగా గ‌డిచిన 10 రోజుల్లో 1,593 కేసులు రికార్డ‌య్యాయి. ప్ర‌స్తుతం రాష్ట్రంలో చేస్తున్న టెస్టుల్లో స‌గ‌టున 19 శాతం మందికి పాజిటివ్ వ‌స్తోంది. ప్రైమ‌రీ కాంటాక్టులో కొంత‌మందికే ప్ర‌భుత్వం టెస్టులు చేయిస్తోంది. అంద‌రికీ టెస్టు చేస్తే కేసులసంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని అధికారులు చెబుతున్నారు. 
3.87 శాతం డెత్ రేటు..!
క‌రోనా డెత్ రేట్ లో రాష్ట్రం దేశ స‌గ‌టును దాటేసింది. డెత్ రేటు ఎక్కువుగా ఉన్న టాప్ 8 స్టేట్స్‌లోకి తెలంగాణ చేరింది. నెల క్రితం వ‌ర‌కూ రాష్ట్రంలో 2.5 శాతం డెత్ రేట్ ఉంటే, ఇప్పుడు 3.87 శాతానికి చేరింది. ప్ర‌భుత్వం దాచిపెట్టిన మ‌ర‌ణాల‌ను కూడా వెల్ల‌డిస్తే, ఈ సంఖ్య 4 శాతం దాటేద‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. మ‌రో వైపు, కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. శుక్ర‌వారం కొత్త‌గా 164 మందికి వైర‌స్ పాజిటివ్ వ‌చ్చింది. ఇందులో 133 కేసులు గ్రేటర్ హైద‌రాబాద్‌లోనే న‌మోద‌య్యాయి. మేడ్చ‌ల్‌లో 6, రంగారెడ్డి  6, సంగారెడ్డి 4, నిజామాబాద్ 3, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ 2, క‌రీంన‌గ‌ర్ 2, ములుగు లో 2 కేసులు న‌మోద‌య్యాయి. సిద్దిపేట్, యాదాద్రి, మంచిర్యాల‌, కామారెడ్డి, మెద‌క్‌, వ‌న‌ప‌ర్తి జిల్లాల్లో ఒక్కో కేసు న‌మోదైంది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,484  కు చేరింది. ఇందులో 2,278 మంది డిశ్చార్జి అవ్వ‌గా, 2,032 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, ఉస్మానియా ఆస్ప‌త్తిలో ఆరుగురు డాక్ట‌ర్ల‌కు క‌రోనా వైర‌స్ సోకింది. దీంతో ఈ హాస్ప‌ట‌ల్‌లో వైర‌స్ బారిన ప‌డిన డాక్ట‌ర్ల సంఖ్య 64కు చేరింది. 

No comments:

Post a Comment