Thursday, June 4, 2020

భారతీ ఇసుక @కేజీ రూ.1000మాత్రమే అంటూ..


పాలకొల్లు (Paalakollu):భారతీ ఇసుక కేవలం రూ.1000 మాత్రమే అంటూ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో టిడిపి ఎమ్మెల్యే డా.నిమ్మల రామానాయుడు గురువారం వినూత్నంగా నిరసన చేపట్టారు. నాలుగు చక్రాల తోపుడు బండిపై ఇసుక ప్యాకెట్లు పెట్టుకొని వాటిపై భారతి ఇసుక అని పేరు రాసి "జె-ఫాక్స్ అదనం అంటూ ఎమ్మెల్యే ఇటుకను అమ్ముతూ పట్టణంలో తిరిగారు. కొందరు మహిళలు బంగారం ఇచ్చి ఇసుక ను కొనుగోలు చేసి మద్దతు తెలిపారు. మరికొందరు నినాదాలు చేస్తూ  ఎమ్మెల్యే వెంట తిరుగుతూ భారతి ఇసుక..అంటూ నిరసన చేపట్టారు. అనంతరం మండల తహశీల్దార్ కు వినతిపత్రం అందజేశారు.

No comments:

Post a Comment