Wednesday, June 24, 2020

విద్యాశాఖ ఆరా..!ప‌బ్జీకి బానిసై "10 మంది విద్యార్థులు " ఆత్మ‌హ‌త్య‌..!

క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలకు వెళ్ల‌లేని ప‌ర‌స్థితి నెల‌కొంది. ఈ క్ర‌మంలో 10వ త‌ర‌గ‌తి విద్యార్థుల విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులంద‌ర్నీ పాస్ చేసే విధంగా నిర్ణ‌యం తీసుకుంది. ఈ పాసైన విధానాన్ని విద్యార్థ‌లు ఇంట‌ర్న‌ల్ ప‌ర‌క్ష‌ల ఆధారంగా గ్రేడింగ్ నిర్ణ‌యించాల‌ని విద్యాశాఖ నిర్ణ‌యించింది. అయితే అందులో కొంద‌రు క‌నీసం ఇంట‌ర్న‌ల్ ప‌రీక్ష‌లు కూడా రాయ‌కుండా గైర్హాజ‌రైన విష‌యం అధికారుల దృష్టికి వ‌చ్చింది. వారు ఎందుకు గైర్హాజ‌రు అయ్యారో తెలుసుకోగా కొన్ని విస్తుపోయే విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. 

హైద‌రాబాద్(Hyderabad):  తెలంగాణ రాష్ట్రంలో ప‌దో త‌ర‌గ‌తి చ‌దివిన విద్యార్థుల్లో ఇంట‌ర్న‌ల్ ప‌రీక్ష‌ల‌కు (ఎఫ్‌-ఏ) 112 మంది గైర్హాజ‌ర‌య్యారు. వీరిలో వివిధ కార‌ణాల‌తో 57 మంది మృతి చెందారు. మృతుల్లో 10 మంది విద్యార్థులు ఆన్‌లైన్ గేమ్ అయిన ప‌బ్జీకి బానిసై ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని తెల‌సింది. ఈ సారి ప్ర‌త్యేక ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈ విషయం విద్యాశాఖ అధికారుల దృష్టికి వ‌చ్చింది. సాధార‌ణంగా ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు వెల్ల‌డించిన అనంత‌రం ఫాసైన‌, ఫెయిల్ అయిన విద్యార్థుల గురించే గ‌ణాంకాల‌ను ప్ర‌క‌టిస్తుంటారు. ఈ విద్యా సంవ‌త్స‌రం (2019-2020)  లో మొత్తం 5,34,903 మంది ప‌దో త‌ర‌గ‌తి కోసం పేర్లు న‌మోదుచేసుకోగా క‌రోనాతో వార్షిక ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ సాధ్య‌ప‌డ‌క పోవ‌డంతో అంద‌రూ ఉత్తీర్ణ‌త సాధించిన‌ట్టుగా ప్ర‌క‌టించారు. వీరిలో 112 మంది, ఇంట‌ర్న‌ల్ ప‌రీక్ష‌లకు గైర్హాజ‌ర‌య్యారు. దీనికి గ‌ల కార‌ణాల‌ను ఈ సారి అధికారులు ఆరా తీయ‌గా 57 మంది విద్యార్థుల మ‌ర‌ణాల విష‌యం తెర‌పైకి వ‌చ్చింది. వీరిలో 10 మంది పిల్ల‌లు ప‌బ్జీ గేమ్‌కు బానిస‌య్యార‌ని, వ‌ద్ద‌ని త‌ల్లిదండ్రులు వారించ‌డం వ‌ల్ల ఫోన్లు తీసుకోవ‌డంతో మ‌న‌స్థాపానికి గురై బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డార‌ని తేలింది. రోడ్డు ప్ర‌మాదాలు, ప్ర‌మాద‌వ‌శాత్తు బావిలో, చెరువుల్లో ప‌డి..అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో మ‌రో 47 మంది చ‌నిపోయిన‌ట్టు ప‌రిశీల‌న‌లో తేలిన‌ట్టు అధికారులు చెప్పారు. ప‌దో త‌ర‌గ‌తి లో ప్ర‌వేశాలు పొందిన త‌ర్వాత ఇత‌ర రాష్ట్రాల‌కు వ‌ల‌స వెళ్ల‌డంతో ప్ర‌వేశాలు ర‌ద్దు చేసిన‌వారు 55 మంది ఉన్నారు. 

ప‌బ్జీ గేమ్‌పై తాజా వార్త‌లు..!

చైనా ఉత్ప‌త్తుల‌ను బ‌హిష్క‌రించాలి అన్న నినాదం దేశ‌వ్యాప్తంగా రాజుకుంది. భార‌త్-చైనా స‌రిహ‌ద్దులో చోటుచేసుకున్న ఘ‌ర్ష‌ణ‌లో 20 మంది భార‌త జ‌వాన్లు అమ‌ర‌వీరుల‌వ్వ‌డంతో దేశ‌మంతా చైనా వ్య‌తిరేక ఉద్య‌మం మ‌రింత ఊపందుకుంది. ఈ క్ర‌మంలో చైనా వ‌స్తువుల‌ను నిషేధించ‌డంతో పాటు చైనా యాప్‌ల‌ను వాడొద్ద‌న్న వాద‌న తెర‌పైకి వ‌చ్చింది. ఈ క్ర‌మంలో యువ‌త ఎక్క‌వుగా ఇష్ట‌ప‌డే ప‌బ్జీ గేమ్ చైనాదా? అన్న ప్ర‌శ్న ఎంతో మందికి వ‌చ్చంది. ఇప్పుడు దాన్ని డిలీట్ చేయాల్సిందేనా అని ఎంతో మంది ప‌బ్జీ ప్రియులు గుండెల్లో  రైళ్లు ప‌రిగెట్టాయి. అస‌లే లాక్‌డౌన్‌లో ఫోన్ల‌కు మ‌రింత అత్కుకుపోయి ప‌బ్జీని విచ్చ‌ల‌విడిగా వాడుతున్నారు. ఈ స‌మ‌యంలో దాన్ని డిలీట్ చేయాలంటే మ‌నుసొప్ప‌క‌పోవ‌డంతో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. 
దీంతో అస‌లు ప‌బ్జీ ఎక్క‌డి నుంచి వ‌చ్చిందంటూ అంద‌రూ గూగుల్‌ను ఆశ్ర‌యిస్తున్నారు. దీనికి స‌మాధామేంటంటే..సాంకేతికంగా అయితే ప‌బ్జీ అస‌లు చైనాదే కాదు. దీన్ని ఐర్‌లాండ్‌కు చెందిన బ్రెద‌ర్ గ్రీన్ అనే వ్య‌క్తి డెవ‌ల‌ప్ చేశాడు. ఈ గేమ్‌ను ద‌క్షిణ కొరియాలోని బ్లూహోల్ డెస్క్‌టాప్స్‌పై అందుబాటులోకి తీసుకొచ్చింది. మొబైల్ వెర్ష‌న్‌లోకి తీసుకొచ్చేందుకు చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్ అనే కంపెనీ సాయం చేస్తూనే బ్లూ హోల్‌లో 10 శాతం వాటాను తీసుకుంది. అంత‌కు మించి ప‌బ్జీకి చైనాతో ఎలాంటి సంబంధం లేదు. ఈ గేమ్‌లో తీవ్ర హింస ఉంద‌ని చైనాలో ప‌బ్జీని రిలీజ్ చేయ‌కముందే బ్యాన్ చేశారుకూడా. ఇవి చ‌ద‌వండి: 70 మంది క‌రోనా రోగులు ఏమ‌య్యారు?

ప‌బ్జీ గేమ్‌కు బానిసైన యువ‌కుడు...

విశాఖ‌ప‌ట్ట‌ణం జిల్లాలో  ప‌బ్జీ గేమ్‌కు బానిసై ఓ యువ‌కుడు మ‌తిస్థిమితం కోల్పోయాడు. అర‌కులోయ మండ‌ల కేంద్రానికి చెందిన కౌశిక్ నిత్యం ప‌బ్జీ గేమ్‌లో మునిగితేలేవాడు. అక‌స్మాత్తుగా బిగ్గ‌ర‌గా అరుస్తూ, పిచ్చిగా ప్ర‌వ‌ర్తించ‌డంతో గ‌మ‌నించిన కుటుంబ స‌భ్యులు ఈ నెల 9న మంగ‌ళ‌వారం స్థానిక ఏరియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వైద్యులు ప్ర‌థ‌మ చికిత్స చేసి, విశాఖ త‌ర‌లించాల‌ని సూచించారు. ప‌బ్జీ గేమ్‌కుబానిస కావ‌డంతోనే మ‌తిస్థిమితం కోల్పోయాడ‌ని వారు చెప్పారు. 

ప‌బ్జీకి బానిసై యువ‌కుడు ఆత్మ‌హ‌త్య‌..!

ప‌బ్జీగేమ్‌కు బానిసైన ఓ 14 ఏళ్ల బాలుడు ఉరివేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్ రాష్ట్రం కోటాలో ఈ నెల 7వ తేదీన చోటుచేసుకుంది. రైల్వే కాల‌నీ పోలీస్ స్టేష‌న్ ఇన్‌చార్జ్ మీనా తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..ఇండియ‌న్ ఆర్మీకి చెందిన ఓ వ్య‌క్తి కుమారుడు 9వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. మూడు రోజుల క్రితం త‌న త‌ల్లి మొబైల్ ఫోన్ నుంచి గేమింగ్ ప్రోగ్రోమ్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నాడు. అప్ప‌టి నుంచి నిరంత‌రాయంగా ప‌బ్జీ గేమ్‌ను ఆడుతున్నాడు. 
ఈ క్ర‌మంలో మూడు రోజుల అనంత‌రం ఓ రాత్రి 3 గంట‌ల స‌మ‌యంలో నిద్ర పోవాల‌ని, చ‌దువుకుంటున్న త‌న సోద‌రుడికి చెప్పి మ‌రో గ‌దిలోకి వెళ్లి వెంటిలేట‌ర్ గ్రిల్‌కు ఉరివేసుకొని మ‌ర‌ణించాడు. దీనిని గ‌మ‌నించిన కుటుంబ స‌భ్యులు వెంట‌నే బాలుడిని ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా.. అప్ప‌టికే మ‌ర‌ణించిన‌ట్టు వైద్యులు ధృవీక‌రించారు. కాగా..బాలుడు త‌న త‌ల్లి, సోద‌రుడితో క‌లిసి కోటా గాంధీ కాల‌నీలో నివాసం ఉంటుండ‌గా, అత‌డి తండ్రి ప్ర‌స్తుతం అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో విధులు నిర్వ‌హిస్తున్నారు. ఇవి చ‌ద‌వండి: రెండు ద‌శాబ్ధాల పాటు క‌రోనా మ‌నుగ‌డ‌..!

No comments:

Post a Comment