ఖమ్మం:ఆర్టీఐ జి ల్లా అధ్యక్షుడు,విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి తోకల నారయ్య మృతి పట్ల ఖమ్మం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండాల(ఆర్జేసీ)కృష్ణ ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఆయన యువకునిగా ఉన్న నాటి నుండే సమస్య ల పట్ల పోరాడే వారన్నారు. ఉద్యోగ విరమణ తరువాత వృద్ధుల,పెన్షనర్ల సమస్య ల పరిష్కారం కోసం ఎప్పుడుతపించేవారన్నారు.ఆర్టీఐ అధ్యక్షునిగా అనేక సమస్యల పరిష్కారానికి కృషిజేశారన్నారు.ఈ సందర్భంగా కృష్ణ నారయ్య తో కలిసి పనిచేసిన సందర్భాలను గుర్తుచేసుకున్నారు.అటువంటి వ్యక్తి మరణించడం తీవ్రంగా కలచివేసిందన్నారు.ఆయన కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Post a Comment

Previous Post Next Post