Monday, May 25, 2020

ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

 అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం రోడ్డు మార్గం ద్వారా తన కాన్వాయ్లో హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్నారు. కరోనా వైరస్ ప్రభావం వల్ల రెండు నెలలుగా చంద్రబాబు నాయుడు హైదరాబాదులోని తన నివాసంలో కుటుంబంతో గడిపారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నేపథ్యంలో ఆంక్షలు విధించడంతో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ కు చేరుకోలేకపోయారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన గ్యాస్ ప్రమాద బాధితులను పరామర్శించేందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఆగిపోయారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల డీజీపీ లకు లేఖ రాయడంతో వారు పర్యటనకు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో ఆదివారం విమానయానం ద్వారా విశాఖపట్నం చేరుకోవాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం విమానయానానికి అనుమతి ఇవ్వకపోవడంతో సోమవారం రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ నుండి  ఆంధ్రప్రదేశ్ లో కి ప్రవేశించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు కు స్వాగతం పలికేందుకు ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు అయిన గరికపాడు చెక్పోస్ట్ వద్ద టిడిపి శ్రేణులు బారులు తీరారు. అనంతరం జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద పార్టీ శ్రేణులతో చంద్రబాబు నాయుడు కొద్దిసేపు పలకరించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు కార్యకర్తలు, అభిమానులు, జేజేలు పలికారు. వెంటనే తన కాన్వాయ్లో అమరావతి కి వెళ్ళిపోయారు.

No comments:

Post a Comment