Friday, May 29, 2020

క‌రోనా: చైనాను దాటిపోయాం..!


ఢిల్లీ:
చైనాలో పుట్టిన క‌రోనా వైర‌స్ మ‌హమ్మారి ప్ర‌పంచ‌దేశాల‌ను వ‌ణికిస్తోన్న విష‌యం తెలిసిందే. భార‌త్‌లోనూ విస్తృత వేగంతో వ్యాపిస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా 7466 కేసులు, 175 మ‌ర‌ణాలు సంభివించాయి. దీంతో దేశంలో క‌రోనా బాధితుల సంఖ్య 1,65,799 కి చేరింది. అంతేకాకుండా మ‌ర‌ణాల సంఖ్య 4706కు చేరింద‌ని కేంద్ర ఆర్యోగ, కుటుంబ సంక్షేమ‌శాఖ వెల్ల‌డించింది. భార‌త్ లో క‌రోనా వైర‌స్ బ‌య‌ట‌ప‌డ్డ త‌ర్వాత 24 గంట‌ల్లో అత్య‌ధిక కేసులు న‌మోదు కావ‌డం ఇదే తొలిసారి. అయితే, క‌రోనా మ‌ర‌ణాల్లో భార‌త్‌, చైనాను దాటేసింది. చైనాలో ఇప్ప‌టి వ‌ర‌కు 4634 కోవిడ్ మ‌ర‌ణాలు సంభవించ‌గా భార‌త్ లో ఈ సంఖ్య 4706 గా ఉండ‌టం వైర‌స్ తీవ్ర‌త‌కు అద్దం ప‌డుతోంది. అంతేకాకుండా క‌రోనా కేసుల్లోనూ ప్ర‌పంచంలో భార‌త్ 9వ స్థానికి ఎగ‌బాకింది. ల‌క్షా 82 వేల కేసుల‌తో జ‌ర్మ‌నీ 8వ స్థానంలో ఉండ‌గా, ల‌క్షా 60 వేల కేసుల‌తో ట‌ర్కీ 10 స్థానంలో కొన‌సాగుతోంది. 
ప్లాస్మా థెర‌పీ చేయొద్దు:డ‌బ్ల్యూహెచ్ ఓ
క‌రోనా నియంత్ర‌ణ‌కు, క‌రోనా వ‌చ్చిన వారికి అంద‌జేస్తున్న వివిధ ర‌కాల మందుల‌ను వాడొద్ద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తేల్చి చెప్పింది. వాటి వ‌ల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయ‌ని పేర్కొంది. ఇవ‌న్నీ ట్ర‌య‌ల్స్ ద‌శ‌లో ఉన్నాయ‌ని, వాటి తుది ఫ‌లితాలు వ‌చ్చే వ‌ర‌కు వాడ‌టం శ్రేయ‌స్క‌రం కాద‌ని తేల్చి చెప్పింది. క‌రోనా రోగుల‌కు ప్మాస్మా థెర‌ఫీ వంటి చికిత్స‌లు చేయొద్ద‌ని స్ప‌ష్టం చేసింది. హైడ్రాక్సీక్లోరోక్విన్‌, అజిత్రోమైసిన్‌, లోపినావిర్‌, రిటోనాన‌విర్‌, రెమిడిసివిర్‌, యుమిఫినోవిర్‌, ఫావిపిర‌విర్ వంటి మందుల‌ను కూడా వాడొద్ద‌ని తెలిపింది. రోగ నిరోద‌క శ‌క్తి క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌కు ఉప‌యోగించే టొసిలిజుమాబ్‌, ఇంట‌ర్ ఫెరాన్ల‌ను కూడా వాడొద్ద‌ని పేర్కొంది. ప్రస్తుతం క‌రోనాకు మందు లేద‌ని తెలిపింది. ఈ మేర‌కు తాజాగా"క్లినిక‌ల్ మేనేజ్‌మెంట్ ఆఫ్ కోవిడ్ -19" పేరుతో ఓ నివేదిక విడుద‌ల చేసింది. సాధార‌ణ‌, తేలిక‌పాటి క‌రోనా ల‌క్ష‌ణాలున్న వారికి పారాసిట‌మ‌ల్ వంటివి వాడితే స‌రిపోతుంద‌ని తేల్చి చెప్పింది. 
సైడ్ ఎఫెక్స్ ఎలా ఉంటాయంటే..?
హైడ్రాక్సీ క్లోరోక్విన్‌, అజిత్రోమైసిన్ మాత్ర‌లు వాడితే గుండె సంబంధిత స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని తెలిపింది.లోపినావిర్‌, రిటోనావిర్ వాడితే జీర్ణాశ‌యానికి సంబంధించిన స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని పేర్కొంది. రెమిడిసివిర్‌తో కాలేయ‌, కిడ్నీకి సంబంధించిన స‌మ్య‌లు, ద‌ద్ద‌ర్లు, బీపీ పెరుగుతుంద‌ని వివ‌రించింది. యుమిఫినోవిర్తో డ‌యేరియా, వాంతులు, ఫావిపిర‌విర్‌ను వాడితే గుండె సంంధిత స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని, ఇంట‌ర్ ఫెరాన్ వాడితే కండ‌రాలు బ‌ల‌హీనంగా మారుతాయ‌ని తెలిపింది. టొసిలిజుమాబ్ వాడితే ముక్కు, గొంతుకు సంబంధించిన ఇన్‌ఫెక్ష‌న్లు వ‌స్తాయి. క‌రోనా వ‌చ్చిన గ‌ర్భిణుల‌కు ప్ర‌స‌వం చేయాల్సి వ‌స్తే, త‌ప్ప‌నిస‌రిగా సిజేరియ‌న్ చేయాల‌నేం లేద‌ని పేర్కొంది. 

No comments:

Post a Comment