Sunday, May 31, 2020

వ‌ర్షం దాటికి పాల‌రాతి రెయిలింగ్ ధ్వంసం..పాక్షికంగా దెబ్బ‌తిన్న తాజ్‌మ‌హల్‌

తెలంగాణ‌లో మూడుర్రోజుల్లో భారీ వ‌ర్షాలు..! 
ఆగ్రా(Agra):ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లోని ప‌లు ప్రాంతాల్లో శుక్ర‌వారం రాత్రి భారీ వ‌ర్షం కురిసింది. ఉరుములు, మెరుపుల‌తో విజృంభించిన వ‌ర్షం దాటికి ఆగ్రాలోని చారిత్ర‌క క‌ట్ట‌డం తాజ్‌మ‌హ‌ల్ పాక్షికంగా దెబ్బ‌తింది. స‌మాధి, రెడ్ సాండ్ స్టోన్ దగ్గ‌రి పాల‌రాతి రెయిలింగ్ ధ్వంసం అయింద‌ని శ‌నివారం ఏఏస్ఐ సూప‌రింటెండింగ్ ఆర్కియాల‌జిస్ట్ బ‌సంత్‌కుమార్ స్వ‌రంక‌ర్ తెలిపారు స‌మాధి పైక‌ప్పు కూడా చెల్లాచెదురైంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ద్వారం కూడా విరిగిపోయింద‌ని, తాజ్‌మ‌హ‌ల్ ప్రాంగ‌ణంలోని కొన్ని చెట్లు కూక‌టి వేళ్ల‌తో స‌హా పెకిలించుకుపోయి నేల‌కొరిగాయ‌న్నారు.

 
కాగా గ‌తంలోనూ తాజ్‌మ‌హ‌ల్ దెబ్బ‌తిన్న సంద‌ర్భాలూ ఉన్నాయి. 2018 ఏప్రిల్ లో కురిసిన వ‌డ‌గ‌ళ్ల వాన వ‌ల్ల తాజ్‌మ‌హ‌ల్ ప్ర‌వేశ ద్వారం వ‌ద్ద ఉన్న పిల్ల‌ర్ దెబ్బ‌తిన్న విషయం తెలిసిందే. మ‌రో వైపు రాష్ట్ర‌వ్యాప్తంగా పిడుగుపాటుకు మృతి చెందిన 13 మంది కుటుంబాల‌కు ఉత్త‌ర్ ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాల‌కు రూ.4 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. యూపీలో రానున్న రోజుల్లోనూ ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. 
తెలంగాణ‌లో మూడుర్రోజుల్లో భారీ వ‌ర్షాలు..! 
హైద‌రాబాద్‌(Hyderabad): ఆగ్నేయ‌, తూర్పు మ‌ధ్య అరేబియా స‌ముద్రంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం రాగ‌ల 24 గంట‌ల్లో వాయుగుండ‌గా మారే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. త‌దుప‌రి 24 గంట‌ల్లో తుఫానుగా మారే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించింది. జూన్ 3 నాటికి ఉత్త‌ర మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్ తీరాల‌ను చేరే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలిపింది. ఛ‌త్తీష్‌ఘ‌డ్  నుంచి, తెలంగాణ‌, రాయ‌ల‌సీమ‌, ద‌క్షిణ‌మ‌ధ్య క‌ర్ణాట‌క మీదుగా ల‌క్ష‌దీవుల వ‌ర‌కు ఉప‌రిత‌ల ధ్రోణి కొన‌సాగుతుంద‌ని పేర్కొంది. నైరుతి రుతుప‌వ‌నాలు రేపు కేర‌ళ‌లోకి ప్ర‌వేశించే అవ‌కాశాలున్నాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో రాగ‌ల 3 రోజులు అక్క‌డ‌క్క‌డ వ‌ర్షాలు ప‌డే సూచ‌న‌లున్నాయ‌ని..ప‌లుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల‌తో కూడిన భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశాలున్న‌ట్టు వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది.

No comments:

Post a Comment