Friday, May 29, 2020

గాలి వాటున మిడ‌త‌ల దండు ప్ర‌యాణం..హెలికాఫ్ట‌ర్ల‌తో ప‌హ‌రా..!

  • అప్ర‌మ‌త్తంగా ఉన్న తెలంగాణ ప్ర‌భుత్వం

హైద‌రాబాద్ (Hyderabad): మిడ‌త‌ల దండు తెలంగాణ రాష్ట్రంలోకి రాకుండా అన్ని ముందు జాగ్ర‌త్త  చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలిపారు. ఈ దండు రాష్ట్రంలోకి ప్ర‌వేశించేందుకు త‌క్కువ అవ‌కాశాలే ఉన్న‌ప్ప‌టికీ అన్ని ముందు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లు  పేర్కొన్నారు. ఒక వేళ గాలి మ‌ర‌లి రాష్ట్రంలోకి వ‌చ్చినా వాటిని సంహ‌రించేందుకు వీలుగా మ‌హారాష్ట్ర‌, చత్తీస్‌ఘ‌డ్ రాష్ట్రాల స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో 15 వేల లీట‌ర్ల మ‌లాతియ‌న్‌, క్లోరోఫైరిపాస్‌, లామ్డా సైలోత్రిన్ ద్రావ‌ణాల‌ను, 12 అగ్నిమాప‌క , 12 జెట్టింగ్ యంత్రాల‌ను సిద్ధం చేస్తున్న‌ట్లు చెప్పారు. 
మిడ‌త‌ల దండు క‌ద‌లిక‌లను ఎప్ప‌టిక‌ప్పుడు గ‌మ‌నిస్తూ, నివార‌ణ చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు ఐదుగురు స‌భ్యుల క‌మిటీని నియ‌మించిన‌ట్లు తెలిపారు. ఈ అంశంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో గురువారం ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష నిర్వ‌హించి ప‌లు ఆదేశాలుజారీచేశారు.
మ‌హారాష్ట్ర‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ స‌రిహ‌ద్దులోని గోండియా ప్రాంతంలో మిడ‌త‌ల దండును సంహ‌రిం చేందుకు పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అక్క‌డ కోట్ల సంఖ్య‌లో మిడ‌త‌ల‌ను చంపారు. అయినా మిగిలిన వాటిలో కొన్ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ మీదుగా పంజాబ్  వైపు వెళ్లే అవ‌కాశాలు న్న‌ట్లు అంచాన వేస్తున్నారు. గాలి మ‌ర‌లి చ‌త్తీష్‌ఘ‌డ్  మీదుగా తెలంగాణ‌వైపు కూడా రావొచ్చు.  వాటి ప్ర‌యాణాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు అంచ‌నా వేసి, అడ్డుకునే చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు ఐదుగురు స‌భ్య‌ల‌తో క‌మిటీని నియ‌మిస్తున్నాం. సీఐపీఎం(సెంట్ర‌ల్ ఇంటిగ్రేట్ పెస్ట్ మేనేజ్‌మెంట్‌) ప్లాంట్ ర‌క్ష‌ణ అధికారి సునీత‌, వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యం ముఖ్య శాస్త్ర‌వేత డాక్ట‌ర్  ఎస్‌.జె.ర‌హ‌మాన్‌, వ‌రంగ‌ల్ అట‌వీ సంర‌క్ష‌ణాధికారి అక్బ‌ర్‌, రామ‌గుండం పోలీస్ క‌మిష‌న‌ర్ స‌త్య‌నారాయ‌ణ‌, మంచిర్యాల క‌లెక్ట‌ర్ భార‌తి స‌భ్యులుగా ఉంటారు. 
ఈ క‌మిటీ శుక్ర‌వారం నుంచి నాలుగు రోజుల పాటు రామ‌గుండంలోనే మ‌కాం వేస్తుంది.హెలికాఫ్ట‌ర్ ద్వారా ఆదిలాబాద్ నుంచి భ‌ద్రాచ‌లం వ‌ర‌కు గోదావ‌రి వెంట ప‌రిస్థితిని గ‌మ‌నిస్తూ ఉంటారు. మిడ‌త‌ల దండు స‌మీపంలోకి వ‌స్తే వాటిని సంహ‌రించే  చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తారు. అని సీఎం పేర్కొన్నారు. 
ఈ స‌మావేశంలో మంత్రి పువ్వాడ అజ‌య్‌, విప్ బాల్క సుమ‌న్‌, ఎమ్మెల్యేలు సి.లక్ష్మారెడ్డి, మ‌ర్రి జ‌నార్థ‌న్‌రెడ్డి , మ‌నోమ‌ర్ రెడ్డి, సండ్ర వెంక‌ట‌వీర‌య్య‌, జీవ‌న్‌రెడ్డి, హైద‌రాబాద్ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, కార్పొరేష‌న్ల ఛైర్మ‌న్లు మారెడ్డి శ్రీ‌నివాస‌రెడ్డి, బాల‌మ‌ల్లు, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేష్‌కుమార్‌, డీజీపీ మహేంద‌ర్ రెడ్డి, ముఖ్య‌కార్య‌ద‌ర్శులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment