Monday, May 18, 2020

ఈ ఫొటో నిద‌ర్శ‌నం..వారి క‌ష్టాలెంటో..!

ఢిల్లీ: ప్ర‌పంచ వ్యాప్తంగా దేశాల‌ను క‌రోనా మ‌హ‌మ్మారి గ‌డ‌గ‌డ‌లాడిస్తూ ఎంద‌రో ప్రాణాల‌ను పొట్ట‌న పెట్ట‌కుంది. ఈ క‌రోనా వైర‌స్ మాన‌వ జీవ‌న విధానంలో ఒక య‌ముడిలా వెంటాడుతూ తిరుగుతోంది. ఇక భార‌త దేశంలో ప‌రిస్థితి చూస్తే..కేసులు పెరుగుతున్న‌ప్ప‌టికీ  అతి తీవ్ర‌త నుండి మాత్రం బ‌య‌ట‌ప‌డిన మాట వాస్త‌వం. కార‌ణం లాక్‌డౌన్ . ఈ లాక్ డౌన్ వ‌ల్ల క‌రోనా కేసులు త‌గ్గించిన‌ప్ప‌టికీ వ‌ల‌స కార్మికుల ప‌రిస్థితి మాత్రం త‌లుచుకుంటే క‌న్నీళ్లు వ‌స్తున్న ప‌రిస్థితి నెల‌కొంది. స్వ‌స్థ‌లాల‌కు వెళ్లేందుకు రాష్ట్రాల స‌రిహ‌ద్దులు దాటేందుకు వారు ప‌డుతున్న క‌ష్టం వ‌ర్ణాతీతం. వేల కిలోమీట‌ర్లు న‌డ‌స్తూ..తిండి లేక ఇబ్బందులు ప‌డుతూ ఎంద‌రో కార్మికులు స్పృహ త‌ప్పారు. మ‌రికొంద‌రు ప్రాణాలు సైతం విడిచారు. అయితే ఈ ఫొటో మాత్రం వ‌ల‌స కార్మికుల క‌ష్టాల‌ను, బాధ‌ల‌ను తెలియ‌జేస్తుంది. క‌నీసం 20 మంది కూడా కూర్చొవ‌డానికి స‌రిపోని ట్ర‌క్కులో సొంత ఊర్ల‌కు వెళ్లాల‌నే గుండె దైర్యంతో ఎన్నో బాధ‌ల‌ను ఓర్చుకుంటున్నారు.అయిన వాళ్ల‌ను చూడాల‌నే తాప‌త్ర‌యంతో అల‌సిసొల‌సి పోతున్నారు. తాజాగా సోష‌ల్‌మీడియాలో ఈ ఫొటో క‌ష్టాలు, క‌న్నీళ్ల‌కు అద్దంప‌డుతోంది. ఓ ట్రాలీలో కుప్ప‌లుగా, ఒక‌రిమీద ఒక‌రు కూర్చొని, కాలు పెట్టే స్థ‌లం లేకుండా ఇళ్ల‌కు ప్ర‌యాణ‌మై పోతున్నారు. ఇదే క‌దా క‌న్నీటి భార‌త మంటే.. అంటూ ప‌లువురు ఆవేద‌న , మౌనాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. 

No comments:

Post a Comment