Sunday, May 31, 2020

‌"మ‌హా"..లో రాష్ట్ర‌ప‌తి పాల‌న‌..? బిజేపీ చెప్పిన‌దేంటి?

న్యూఢిల్లీ (New Delhi):
క‌రోనా ను నియంత్రించ‌డంలో పెద్ద‌పెద్ద దేశాలే త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్న ఈ త‌రుణంలో ఇక సామాన్య రాష్ట్రాల ప‌రిస్థితి ఎలా ఉంటుందో చూస్తునే ఉన్నాం.. కానీ అది సాకుగా చూపించి రాజ‌కీయంగా ఆ నాయ‌కుల ప్ర‌తిష్ట‌తను  దెబ్బ‌తీసే స‌మ‌యం ఇదికాద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. తాజాగా క‌రోనాను నియంత్రించ‌డంలో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం (శివ‌సేన‌) విఫ‌ల‌మైంద‌ని, రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల‌న్న డిమాండ్‌ను  నారాయ‌ణ రాణే తెర‌లేపారు. ఇది కాస్త మీడియాలో చ‌ర్చ‌కు దారి తీస్తోంది.
ఉద్ధ‌వ్ ఠాక్రే పాల‌న అనుభ‌వ రాహిత్యంపై అడ‌గ్గా..ఇలాంటి విష‌యాలు మాట్లాడ‌టానికి అస‌లు ఇష్ట ప‌డ‌న‌ని అమిత్‌షా తెలిపారు.
 దీనిపై కేంద్ర  హోం మంత్రి అమిత్‌షా స్పందించారు. ఆ వ్యాఖ్య‌లు పూర్తిగా నార‌య‌ణ రాణే వ్య‌క్తిగ‌త వ్యాఖ్య‌ల‌ని తేల్చి చెప్పారు. ఇవి బీజేపీ వ్యాఖ్య‌లు ఎంత మాత్ర‌మూ కావ‌ని స్ప‌ష్టం చేశారు. క‌ట్ట‌డిలో ప్ర‌తి రాష్ట్ర‌మూ ఇతోధికంగా, స‌మ‌ర్థ‌వంతంగా త‌మ‌త‌మ పాత్ర నిర్వ‌హించాయ‌ని ఆయ‌న ప్ర‌శంసించారు. ఉద్ధ‌వ్ ఠాక్రే పాల‌న అనుభ‌వ రాహిత్యంపై అడ‌గ్గా..ఇలాంటి విష‌యాలు మాట్లాడ‌టానికి అస‌లు ఇష్ట ప‌డ‌న‌ని అమిత్‌షా తెలిపారు. ప్ర‌తి రాష్ట్ర‌మూ క‌రోనాను ఎదుర్కొంటూనే ఉంద‌ని, ఎవ‌రో అద్భుతంగా ప‌నిచేశారు, ఎవ‌రు చేయ‌లేద‌న్న‌ది చెప్ప‌డం మంచి ప‌ద్ధ‌తి కాద‌ని పేర్కొన్నారు. క‌రోనాను కేంద్రం ఎదుర్కోవాల‌ని, అలాగే రాష్ట్రం , ప్ర‌తి మ‌నిషీ ఎదుర్కోవాల్సిందేన‌ని అన్నారు. అంతేగానీ..ఒక రాష్ట్రం బాగా ప‌నిచేసింద‌ని, మ‌రో రాష్ట్రం బాగా ప‌నిచేయ‌లేద‌ని చెప్ప‌డం స‌రైన విధానం కాద‌ని షా స్ప‌ష్టం చేశారు. 
లాక్‌డౌన్ పొడ‌గింపు ఆలోచ‌న‌లో సీఎం..!
ఆదివారంతో దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ 4.0 ముగియ‌నుండ‌గా..దీనిని కొన‌సాగిస్తారా?  ముగిస్తారా? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఈ నేప‌థ్యంలో లాక్‌డౌన్ పొడిగించ‌డానికే మ‌హారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధ‌వ్‌ఠాక్రే మొగ్గు చూపుతున్నారు. ఈ మేర‌కు శుక్ర‌వారం ఆయ‌న సంకేతాలు ఇచ్చారు. ముఖ్యంగా ముంబై, పుణే లాంటి క‌రోనా హాట్‌స్పాట్స్‌లో లాక్‌డౌన్ క‌ఠినంగా అమ‌లు చేసి, మిగ‌తా చోట్ల ఆంక్ష‌ల‌ను స‌డ‌లించాల‌ని భావిస్తున్న‌ట్టు పేర్కొన్నారు. వ‌చ్చే 15 రోజులు అ త్యంత కీల‌క‌మ‌ని, ప్ర‌తి ఒ క్క‌ళ్లూ అప్ర‌మత్తంగా ఉండాల‌ని ఉద్ధ‌వ్ సూచించారు. 
మే 31 త‌ర్వాత చేప‌ట్టే చ‌ర్య‌ల గురించి కేంద్రం నుంచి స్ప‌ష్ట‌త వ‌చ్చిన త‌ర్వాత కొత్త‌గా నిబంధ‌న‌లు, ఆంక్ష‌లు  స‌డ‌లింపుపై మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రూపొందిస్తామ‌ని ఆయ‌న తెలిపారు. క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నా వైర‌స్ నియంత్ర‌ణ‌లోనే ఉంద‌ని, మ‌ర‌ణాల రేటు కూడా రాష్ట్రంలో త‌గ్గింద‌న్నారు. కానీ ఈ స‌మయంలో ఉదాసీన‌త ప‌నికిరాద‌ని అన్నారు. ముంబై, పూణేలో వైర‌స్ విజృంభ‌ణ కీల‌క ద‌శ‌క చేరింద‌ని, ఇప్పుడే మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండ‌టం చాలా ముఖ్య‌మ‌ని అన్నారు. ప్రస్తుతం దేశంలోనే అత్య‌ధికంగా క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు మ‌హారాష్ట్ర‌లోనే న‌మోద‌వుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ కేసులు సంఖ్య 62,000 వేల‌కు దాటింది. 

No comments:

Post a Comment