Wednesday, May 27, 2020

మ‌హానాడు వేళ ఓట‌మిపై విశ్లేష‌ణ‌..పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ఆలోచింప‌జేస్తున్న వైనం..!

అమ‌రావ‌తి:
మ‌హానాడు కార్య‌క్ర‌మం బుధ‌వారం ప్రారంభ‌మైన వేళ‌..పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో.. నాయ‌కుల్లో.. అభిమానుల్లో ఓ పండ‌గ వాతావ‌ర‌ణం క‌నిపించిన ప‌రిస్థితి నెల‌కొంది. క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్ర‌భుత్వ నింబంధ‌న‌ల మేర‌కు టిడిపి అధినేత, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి ఆదేశాల మేర‌కు జూమ్ యాప్ ద్వారా డిజిట‌ల్ మ‌హానాడు కార్య‌క్ర‌మం ప్రారంభించారు. రెండ్రోజుల పాటు జ‌రిగే ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఆన్‌లైన్‌లో వేల సంఖ్య‌లో పాల్గొంటున్నారు. అయితే మ‌హానాడు2020 సంద‌ర్భంగా.. ఆ పార్టీ అభిమాని, కార్య‌క‌ర్త అయిన ఓ విశ్లేష‌కుడు సామాజిక మాధ్య‌మాల్లో ఆ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ఆలోచింపజేసే మెస్సేజ్‌ను పంపాడు.. అది గ‌త ఎన్నిక‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టిడిపి ఓట‌మి గురించి ప్ర‌స్తావిస్తూ ఉంది..
2019 ఎన్నిక‌ల్లో వైసీపీ కి విజ‌యం ఎలా ద‌క్కింది? 
  • గ‌త 2014 లో ఎన్నిక‌ల్లో వైసీపీ కి రాష్ట్ర వ్యాప్తంగా పోల్ అయిన ఓట్లు- 13131029 .
  • అలాగే 2019లో వైసిపీకి వ‌చ్చిన ఓట్లు -15530231.
  • ఈ విధంగా వైసీపీకి గ‌త 2014 సంవ‌త్స‌రం నుండి 2019 సంవ‌త్స‌రం వ‌ర‌కు పెరిగిన ఓట్లు - 2399202 .
  • ఈ పెరుగుద‌లకు మూడు మార్గాల ద్వారే వైసీపీ అధికారం లోకి వ‌చ్చింది. 
  • వైసీపీకి బ‌దిలీ అయిన కాంగ్రెస్ ఓట్లు.
  • వైసీపీకి బ‌దిలీ అయిన బిజేపీ ఓట్లు.
  • కొత్త ఓట‌ర్లు అధిక మొత్తంలో వైసీపీ వైపు ఆక‌ర్షితులు కావ‌డం.
  • వైసీపీకి బ‌దిలీ అయిన కాంగ్రెస్ ఓట‌ర్లు.. 2014 లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆ పార్టీకి- 817920 ఓట్లు పోల్ అయ్యాయి.ఈ 2019 ఎన్నిక‌ల్లో  కాంగ్రెస్ పార్టీకి -406568 ఓట్లు పోల్ అయినాయి. అంటే దాదాపుగా- 411352 ఓట్లు కాంగ్రెస్ నుంచి వైసీపీకి మ‌ళ్లాయి. 
  • మ‌రోక అంశం ఏమిటంటే.. టిడిపి- కాంగ్రెస్ అనుకూల విధానాన్ని అనుస‌రించ‌డం న‌చ్చ‌ని సంప్ర‌దాయ కాంగ్రెస్ వ‌ర్గాలు జ‌గ‌న్ వైపు మ‌ళ్లాయి. 
  • ఇక బిజేపీ నుండి వైసీపీ బ‌దిలీ అయిన ఓట్ల‌లో  2009 లో రాష్ట్రంలో ఒంట‌రిగా పోటీ చేసిన బిజేపీ -369154 ఓట్లు తెచ్చ‌కుంది. 
  • మ‌ళ్లీ 2019 లో మ‌ళ్లీ ఒంట‌రిగా పోటీ చేసిన బిజేపీ- 303806 ఓట్లు తెచ్చ‌కుంది.దీంతో బిజేపీ నుంచి సుమారు -65348 ఓట్లు వైసీపీ వైపు మ‌ళ్లాయి.
  • చంద్ర‌బాబు అనుస‌రించిన మోడీ వ్య‌తిరేక‌త వ‌ల్ల కొంత మంది బిజేపీ వారు రాష్ట్రంలో బిజేపీ గెల‌వ‌దు కాబ‌ట్టి వైసీకీ త‌మ ఓటు బ‌దిలీ చేశారు. 
  • కొత్త ఓట‌ర్లు విష‌యానికి వ‌స్తే.. అధిక మొత్తం వైసీపీ వైపు మ‌ళ్ల‌డం. 2014 లో రాష్ట్ర వ్యాప్తంగా పోల్ అయిన ఓట్లు -28749431 . 2019 లో రాష్ట్ర  వ్యాప్తంగా పోల్ అయిన  ఓట్లు- 31598569 . ఈ విధంగా కొత్త‌గా పెరిగిన ఓట్లు- 2849431.
  • ఈ పెరిగిన 1892802 ఓట్లు వైసీపీకి 956336 ఓట్లు తెలుగుదేశం వైపు మ‌ళ్లాయి. 
  • 2014 లో తెలుగుదేశం ఓట్లు-13806298. 2014లో తెలుగుదేశం, బిజేపీ, జ‌న‌సేన కూట‌మిగా పోటీ చేశాయి కాబ‌ట్టి, 2019 లో జ‌న‌సేన‌, బిజేపీ ఓట్ల‌న్నీ 2014 లో టిడిపికి వ‌చ్చిన ఓట్లులో నుంచి తీసివేయ్య‌డం జ‌రిగింది. 
తెలుగు దేశం ఓట్లు-  13806298 .
జ‌న‌సేనా ఓట్లు -  1949613 .
బిజేపీ ఓట్లు-  303806 .
తెలుగుదేశంకి రావాల్సిన ఓట్లు -11552879 .
తెలుగుదేశంకి వ‌చ్చిన ఓట్లు- 12509215.
తెలుగుదేశంకి అద‌నంగా వ‌చ్చిన ఓట్లు- 956336.
ఈ- 956336 ఓట్ల కొత్త ఓట్ల‌లో నుంచి వ‌చ్చాయి. 
కొత్త‌గా పెరిగిన ఓట్లు 2849431 లో.. తెలుగుదేశం పార్టీ -957336 పంచుకుంటే వైసీపీ పార్టీ- 1892802 పంచుకుంది. 
కొత్త ఓట‌ర్లు- 1892802, 
బిజేపీ ఓట‌ర్లు -65348 
కాంగ్రెస్ ఓట‌ర్లు- 411352 
మొత్తం ఓట‌ర్లు -2369502  
మ‌రియు 2014 లో వైసీపీకి వ‌చ్చిన ఓట్లు- 13131029 క‌లిపి వైసీపీకి- 15530231 ఓట్లు పోల్ అయ్యాయి. కొత్త ఓట‌ర్ల‌ను తెలుగుదేశం వైపు మ‌ళ్లించ‌డంలో పార్టీ కొంచె వెనుక బ‌డింద‌నే చెప్పాలి. 

గ‌మ‌నికః ఇది పార్టీ కార్య‌క‌ర్త విశ్లేష‌ణ‌, సోష‌ల్ మీడియా ద్వారా సేక‌రించిన‌ది.  

No comments:

Post a Comment