Thursday, May 28, 2020

తెలుగుదేశం ఎవ్వ‌రికీ భ‌య‌ప‌డ‌దు

  • ఎన్టీఆర్‌కు భార‌త‌ర‌త్న‌..మ‌హానాడులో ఏక‌గీవ్ర తీర్మానం
  • రెండో రోజు వేడ‌క‌లో నారా చంద్ర‌బాబునాయుడు

అమ‌రావ‌తి: తెలుగుదేశం పార్టీ మ‌హానాడు కార్య‌క్ర‌మం రెండో రోజు ఎన్టీఆర్‌కు ఘ‌న నివాళుల‌తో ప్రారంభ‌మైంది. గురువారం ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న విగ్ర‌హానికి  పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు పుష్పాంజ‌లి ఘ‌టించారు. సీనియ‌ర్ నేత‌లు, ఇత‌ర నాయ‌కులు నివాళ్ల‌ర్పించారు. తెలుగు జాతి ఖ్యాతిని విశ్వ‌వ్యాప్తం చేసిన ఎన్టీఆర్ కు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని మ‌హానాడు వేదిక‌గా తెలుగుదేశం ఏక‌గ్రీవం తీర్మానం చేసింది. ఇందుకోసం టిడిపి పార్టీ కృషి చేస్తోంద‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. 

ఎన్టీఆర్ వ్య‌క్తికాదు...వ్య‌వ‌స్థ అని కొనియాడారు. ఆయ‌న జీవితం ఆద‌ర్శ‌మ‌ని గుర్తు చేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిపైనా ఉంద‌ని పిలుపునిచ్చారు. 
తెలుగుదేశం ఎవ్వ‌రికీ భ‌య‌ప‌డ‌ద‌ని తేల్చిచెప్పిన చంద్ర‌బాబు..స‌వాళ్లు పార్టీకి కొత్త‌కాద‌ని స్ప‌ష్టం చేశారు. కార్య‌క‌ర్త‌లే పార్టీకి శ‌క్తి అని, వారి శ‌క్తి యుక్తుల‌తో పార్టీ ఈ స్థాయిలో బ‌లంగా ఉంద‌ని భ‌విష్య‌త్తులో మ‌రింతముందుకెళ్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. 
ఎప్పుడు ఎక్క‌డ అవ‌ర‌ముంటే అక్క‌డ తాను ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాన‌ని హిందూపురం ఎమ్మెల్యే ప్ర‌ముఖ సినీన‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌క‌టించారు. ఎవ‌రికీ భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్న ఆయ‌న ..చంద్ర‌బాబు సార‌థ్యంలో తెలుగుదేశం పార్టీ మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా మ‌హానాడులో తీర్మానం ప్ర‌వేశ పెట్ట‌గా.. ఆ అంశం పై బాల‌కృష్ణ ప్ర‌సంగించారు. తెలుగుజాతికి ఎన్టీఆర్ చేసిన సేవ‌ల‌ను సీనియ‌ర్ నేత‌లు అశోక్‌గ‌జ‌ప‌తిరాజు, గోరంట్ల బుచ్చ‌య్య‌చౌద‌రి కొనియాడారు. 

వైసీపీకి వ‌డ్డీతో స‌హా చెల్లిస్తాం: చంద్ర‌బాబు

తెలుగుదేశం అధికారంలోకి వ‌చ్చాక వైసీపీ అరాచ‌కాల‌కు వ‌డ్డీతో స‌హా చెల్లిస్తామ‌ని ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఏపీలో అరాచ‌క‌పాల‌న కొన‌సాగుతోంద‌ని పేర్కొన్నారు. ప్ర‌శ్నిస్తే టీడీపీ నేత‌లపై దాడులు చేస్తూ అక్ర‌మ కేసులు బ‌నాయిస్తున్నార‌ని తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సోష‌ల్ మీడియాలో ప్ర‌శ్నిస్తున్న త‌ట‌స్థుల‌పై కేసులు పెడుతున్నార‌ని మండిపడ్డారు. 

ఎన్టీఆరే స్ఫూర్తి...

నంద‌మూరి తార‌క‌రామారావు వ్య‌క్తి కాదని..శ‌క్తి అని.. ఆయ‌నే మ‌నంద‌రికీ స్ఫూర్తి అని చంద్ర‌బాబు కొనియాడారు. 33 ఏళ్లుగా ఆయ‌న సినీ ఫీల్డ్‌లో ఉన్నార‌ని, మొత్తం 295 చిత్రాల్లో న‌టించార‌ని పేర్కొన్నారు. ఆయ‌న న‌టించిన  పాత్ర‌లు స‌మాజానికి మంచి సందేశ‌మిచ్చాయ‌న్నారు. సేవా నిర‌తికి నిలువెత్తురూప‌మ‌ని, అధికారం లేన‌ప్పుడు కూడా సేవాభావంతో ఉండేవార‌ని పేర్కొన్నారు. 
దివిసీమ సైక్లోన్‌, చైనా దురాక్ర‌మ‌ణ చేసిన‌ప్పుడు, పోలీస్ వెల్ఫేర్ ఫండ్‌, రాయ‌ల‌సీమ దుర్భిక్ష్యం వ‌చ్చిన‌ప్పుడు సాటి మ‌నిషిగా స‌మాజం కోసం ప‌నిచేశార‌ని చంద్ర‌బాబు కొనియాడారు. అవినీతి అంటే ఆయ‌న ఆమ‌డ‌దూరంలో ఉండేవార‌న్నారు. ఎన్టీఆర్ రాజ‌కీయ దురంధురుడ‌ని, రాజ‌కీయాల్లో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి అని అన్నారు. 9 నెల‌ల్లో పార్టీ పెట్ట‌డం, దేశ స్థాయిలో అన్ని రాజ‌కీయ పార్టీల‌ను ఏకం చేసి, కాంగ్రెస్‌పై పోరాడి..ప్ర‌త్యామ్నాయ ప్ర‌భుత్వాన్ని ఏర్ప‌టు చేయ‌డానికి నాంది ప‌లికార‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. 

No comments:

Post a Comment