అమ‌రావ‌తి: దాదాపు రెండు నెల‌ల త‌ర్వాత ఏపీలో ఆర్‌టీసీ బ‌స్సులు రోడ్డెక్కాయి. అన్ని ర‌కాల క‌రోనా జాగ్ర‌త్త‌లు తీసుకుంటూనే బ‌స్సులు న‌డిపేలా అధికారులు సిద్ధ‌మ‌య్యారు. తొలివిడ‌త‌లో 1683 బ‌స్సులు న‌డిపేందుకు ఏర్పాట్లు చేశారు. మొత్తంగా 70 శాతం బ‌స్సుల‌ను రోడ్డెక్కించ‌బోతున్నారు. క‌ర్నూలు మొత్తం రెడ్‌జోన్‌లో ఉండ‌టం వ‌ల్ల అక్క‌డ చాలా త‌క్కువ స‌ర్వీసుల‌ను న‌డుపుతున్నారు. దూర ప్ర‌యాణాలు చేసే వారికి బుధ‌వారం సాయంత్రం నాలుగు గంట‌ల నుంచే ఆన్‌లైన్ రిజ‌ర్వేష‌న్‌ను అందుబాటులోకి తెచ్చారు.  ప‌దేళ్ల‌లోపు చిన్నారులు, 60 ఏళ్లు పైబ‌డిన వారు బ‌స్సుల్లో ప్ర‌యాణించ‌వ‌ద్ద‌ని అధికారులు తెలిపారు. ప్ర‌యాణికులు బ‌స్సులో ఎక్కేముందు చేతులు శుభ్ర‌ప‌రుచుకునేలా శానిటైజ‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. ప్ర‌తి ఒక్క‌రూ మాస్క్ ధ‌రించాల‌ని, మాస్క్‌లు తెచ్చుకోని వారు బ‌స్ డిపోల్లోని స్టాల్స్‌లోనే కొనుగోలు చేయ‌వ‌చ్చ‌ని ఆర్‌టీసీ అధికారులు పేర్కొన్నారు. 

Post a Comment

Previous Post Next Post