Sunday, May 31, 2020

అక్క‌డ ఆదేశం..ఇక్క‌డ ఆచ‌ర‌ణ‌..!

ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఎమ్మెల్యే సండ్ర‌

ఖ‌మ్మం(Khammam): "తెలంగాణ రాష్ట్ర ఐటీ మ‌రియు పుర‌పాల‌క శాఖ మంత్రి  కేటీఆర్ పిలుపుమేర‌కు సీజ‌న‌ల్ వ్యాధుల నివార‌ణ‌లో భాగంగా ప‌రిస‌రాల‌ను ప్ర‌తి ఆదివారం ఉద‌యం 10 గంట‌ల 10 నిమిషాల‌కు 10 నిమిషాలు ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రం చేయాలి" ..అని ఇచ్చిన పిలుపు మేర‌కు ఆదివారం స‌త్తుప‌ల్లి ఎమ్మె‌ల్యే సండ్ర ‌వెంక‌ట వీర‌య్య స్వ‌యంగా రంగంలోకి దిగారు. స్థానిక మున్సిపాలిటీ ప‌రిధిలోని రాజీవ్ కాల‌నీలో నిల్వ ఉన్న నీటిని తొల‌గించారు. 
ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ప్ర‌తి వారం కేవ‌లం ప‌ది నిమిషాల పాటు ఇంటి శుభ్ర‌త కోసం స‌మ‌యం కేటాయిస్తే మ‌లేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి సీజ‌న‌ల్ వ్యాధుల‌ను అరిక‌ట్ట‌డానికి వీల‌వుతుంద‌ని తెలిపారు. ఇళ్ల‌ల్లో ప‌రిస‌ర ప్రాంతాల‌లో ప‌రిశుభ్ర‌త పాటించ‌డం వ‌ల్ల పొడి వాతావ‌ర‌ణం ఏర్ప‌డి దోమ‌ల లార్వా, క్రిమికీట‌కాల ఉత్ప‌త్తి నివార‌ణ‌కు అవ‌కాశం ఉంటుంద‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌లంద‌రూ ప్ర‌తి ఆదివారం ఉద‌యం 10 గంట‌ల‌కు ప‌ది నిమిషాలు పాటు ప్ర‌తిఒక్క‌రూ వారివారి ఇళ్ల‌ల్లో డ్రైడే పాటించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. సీఎం కేసీఆర్ ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా యువ నాయ‌కులు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వినూత్న ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ పెడుతూ అభివృద్ధి ప‌థంలో ముందుకు దూసుకుపోతున్నార‌ని అన్నారు. అందులో భాగంగా ప్ర‌జ‌ల‌లో సామాజిక సృహ పెంపొందించి త‌మ ప‌రిస‌రాల‌ను తామే ప‌రిశుభ్ర‌ప‌రుచుకొని త‌ద్వారా ప‌రిశుద్ధ గ్రామాలు, ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాలుగా తీర్చిదిద్దాల‌ని చేప‌ట్టిన బృహుత్త‌ర కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని పిలుపునిచ్చారు. 
                                                          ఆ దేశంలో క‌రోనా ఓ ఆదాయ వ‌న‌రుగా మారింది..!

No comments:

Post a Comment