ఖ‌మ్మం: ఖ‌మ్మం బ‌స్ స్టాండ్ ఆవ‌ర‌ణంలో ర‌వాణా శాఖా మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమార్ బుధ‌వారం ఆక‌స్మీకంగా ప‌ర్య‌టించారు. ఇందులో భాగంగా బ‌స్సుల వివ‌రాలు, ప్ర‌యాణీకుల‌కు అందిస్తున్న సౌక‌ర్యాల‌కు సంబంధించిన వివ‌రాల‌ను ఆర్ ఎంను అడిగి తెలుసుకున్నారు. ప్ర‌తి డిపోలో కండ‌క్ట‌ర్ కు త‌ప్ప‌ని స‌రిగా హ్యాండ్ శానిటైజ‌ర్ ఇవ్వాల‌ని, బ‌స్సులో ప్ర‌యాణికుల‌కు హ్యాండ్ శానిటైజ్ చేసిన త‌ర్వాత‌నే టికెట్ ఇవ్వాల‌ని అన్నారు. మాస్క్ లేకుంటే టికెట్ ఇవ్వ‌వ‌ద్ద‌ని ఆదేశించారు. ఆ త‌ర్వాత మంత్రి కోదాడ డిపో బ‌స్సు ఎక్కారు. శానిటైజ‌రు ఏదంటూ కండ‌క్ట‌ర్‌ను అడిగారు. ఇవ్వ‌లేద‌ని చెప్ప‌డంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వెంట‌నే సూర్యాపేట జిల్లా ఆర్ ఎంతో ఫొన్లో మాట్లాడారు. కంట‌క్ట‌ర్‌కు శానిటైజ‌ర్ ఇవ్వ‌ని కోదాడ డిపో మేనేజ‌ర్‌ను స‌స్పెండ్ చేయాల‌ని ఆదేశించారు. క‌రోనా వైర‌స్ వ్యాప్త‌ని అరిక‌ట్ట‌డంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల ప‌రిధిలోని అన్ని బ‌స్సుల‌కు విధిగా శానిటైజ‌ర్ అందించాల‌ని ఆదేశాలు ఇచ్చామ‌ని తెలిపారు. నిబంధ‌న‌లు పాటించ‌ని వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అన్నారు. ప్ర‌యాణికుల‌కు స్వ‌యంగా శానిటైజ‌ర్ స్ప్రే చేశారు. 

Post a Comment

Previous Post Next Post