Thursday, May 28, 2020

ఇంట్లో తిండి లేదు..అందుకే దొంగ‌తనం చేశా

  • స‌రుకులు ఇప్పించి పోలీసులు
మ‌ధ్య‌ప్ర‌దేశ్ (Madhya Pradesh) : మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్ లో విష్ణు విహార్ కాల‌నీలోని ఒక ఇంట్లో దొంగ‌త‌నంగా ప్ర‌వేశించిన వ్య‌క్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 
ఎందుకు దొంగ‌త‌నం చేశావు? అని పోలీసులు అడిగితే..లాక్‌డౌన్ వ‌ల్ల ఉపాధి లేదు..ఇంట్లో తిండి లేదు.. అందుకే దొంగ‌త‌నం చేశా..అని చెప్పిన‌ట్టు ఇండోర్ ఏరోడ్రోమ్ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ క‌ల్ప‌నా చౌహాన్ తెలిపారు.అత‌డు నిజ‌మే చెప్తున్నాడ‌ని పోలీసులు ద‌ర్యాప్తులో నిర్థారించుకున్న‌ట్లు ఏఎన్ఐ వార్త సంస్థ తెలిపింది. దీంతో అత‌డి కుటుంబానికి అవ‌స‌ర‌మైన స‌రుకుల‌ను పోలీసులే అందించినట్లు క‌ల్ప‌నా చౌహాన్ తెలిపారు. 
క‌రోనా వైర‌స్‌ను నియంత్రించటానికి రెండు నెల‌ల‌కు పైగా దేశ‌వ్యాప్తంగా కొన‌సాగుతున్న లాక్‌డౌన్ వ‌ల్ల వ‌ల‌స‌కార్మికులు, కూలీలు తీవ్ర క‌ష్టాలు ప‌డుతున్న వార్త‌లు ప్ర‌తిరోజూ వెలుగుచూస్తున్నాయి. 
ప్ర‌భుత్వం గ‌త నెల రోజులుగా ప్ర‌త్యేక రైళ్లు న‌డుపుతున్నా కూడా ల‌క్ష‌లాది మంది కార్మికులు వంద‌లాది కిలోమీట‌ర్లు కాలిన‌డ‌క‌న ప్ర‌యాణిస్తుంట‌డం ఆగ‌లేదు.
అనేక చోట్ల ఆక‌లితో, అల‌స‌ట‌తో కూలీలు చ‌నిపోతున్న వార్త‌లూ క‌లిచివేస్తున్నాయి. తాజాగా సుప్రీంకోర్టు కూడా వ‌ల‌స కూలీల క‌ష్టాల‌ను తీర్చ‌టానికి ఎటువంటి చ‌ర్య‌లు చేపట్టార‌ని కేంద్రాన్ని, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను ప్ర‌శ్నించింది. అంద‌రికీ  వ‌స‌తి, ఆహారం, క‌నీస స‌దుపాయాలు క‌ల్పించి తీరాల‌ని నిర్ధేశించింది. 
ఇదిలా ఉంటే..ప్ర‌త్యేక రైళ్ల‌లో వల‌స కార్మికులు తిండి, నీరు, క‌నీస స‌దుపాయాలు లేక అనారోగ్యం పాల‌వ‌డం, చ‌నిపోవ‌డం జ‌రుగుతోంద‌న్న మీడియా వార్త‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న జాతీయ మాన‌హ‌హ‌క్కుల క‌మిష‌న్‌..గుజ‌రాత్‌, బిహార్ రాష్ట్రాల ముఖ్య కార్య‌ద‌ర్శుల‌తో పాటు కేంద్ర హోంశాఖ కార్య‌ద‌ర్శి, రైల్వే బోర్డు ఛైర్మ‌న్‌ల‌కు నోటీసులు జారీ చేసింది. 

No comments:

Post a Comment