Tuesday, May 19, 2020

ద‌క్షిణ తెలంగాణ‌పై కేసీఆర్ చిన్న‌చూపు

టి.టిడిపి రాష్ట్ర అధికార ప్ర‌తినిధి నెల్లూరి దుర్గా ప్ర‌సాద్‌
ఖ‌మ్మం: రాష్ట్రంలో మొద‌ట క‌రోనా టెస్టులు బాగానే చేసిన‌ప్ప‌టికీ మ‌ళ్లీ ఇప్పుడు ఎందుకు త‌గ్గించారో అర్థం కావ‌డం లేద‌ని తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్ర‌తినిధి నెల్లూరి దుర్గా ప్ర‌సాద్ ప్ర‌శ్నించారు. మంగ‌ళ‌వారం ఖ‌మ్మంలో జ‌రిగిన విలేక‌ర్ల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. ద‌క్షిణ తెలంగాణ‌పై సీఎం కేసీఆర్ చిన్న‌చూపు చూస్తున్నార‌ని పేర్కొన్నారు. నీటి విష‌యంలో కేసీఆర్ వైఖ‌రి వింత‌గా ఉంద‌న్నారు. నీళ్ల కోస‌మే తెచ్చుకున్న తెలంగాణ‌లో మ‌ళ్లీ జ‌ల‌వివాదం తో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అన్యాయం జ‌రుగబోతోంద‌న్నారు. రాష్ట్రంలో వెంట‌నే పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు అన్నీ ప్రాజెక్టుల‌ను పూర్తిచేయాల‌ని డిమాండ్ చేస్తున్నామ‌న్నారు. క‌రోనా విష‌యంలో మొద‌ట్లో పారాసిట్మాల్ చాలు అన్నార‌ని.. ఇప్పుడేమో క‌రోనాతో స‌హ‌జీవ‌నం చేయాలంటున్నార‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్ర‌తిఒక్క‌రికీ క‌రోనా టెస్టులు చేయాల‌న్నారు. నీటి విష‌యంలో టిడిపి మొద‌టి నుండి ఒకే మాట‌పై ఉంద‌ని..నీటి ల‌భ్య‌త బ‌ట్టి ఇరురాష్ట్రాలు నిర్ణ‌యం తీసుకోవాల‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వ నిధుల‌ను ఏపీ ప్ర‌భుత్వం సొంత ప‌థ‌కాల‌కు వాడుకుంటోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. 
తెలంగాణలో కొత్త విత్త‌న విధానంతో రైతు బంద్‌ని బంద్ చేయాల‌ని యోచిస్తుంద‌ని ఆరోపించారు. రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర ఎంత క‌ల్పిస్తారో హామీ ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. టిడిపి అప్పుడు..ఇప్పుడు పేద‌వాడి ప‌క్ష పాతిగానే ఉంద‌ని, తెలిపారు.  టిడిపి  ఖ‌మ్మం పార్ల‌మెంట్ అధ్య‌క్షులు కూర‌పాటి వెంక‌టేశ్వ‌ర్లు మాట్లాడుతూ..వైజాగ్ లో డాక్ట‌ర్‌.సుధాక‌ర్‌పై పోలీసులు దారుణంగా వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాద‌ని తెలిపారు.ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి ఖ‌మ్మం పార్ల‌మెంట‌రీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గుత్తా సీత‌య్య‌, ఉపాధ్య‌క్షులు రాయ‌పూడి జైక‌ర్‌, కొండ‌బాల క‌ర్ణాక‌ర్‌, ఆర్గ‌నైజింగ్ సెక్ర‌ట‌రీ నాగార్జున శ్రీ‌ను, న‌గ‌ర క‌న్వీన‌ర్ మ‌ల్లేంపాటి అప్పారావు, ఎల్లంకి మోహ‌న్‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.  

No comments:

Post a Comment