హైద‌రాబాద్: తెలంగాణ‌లో 10వ త‌గ‌ర‌తి ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు హైకోర్టు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. జూన్ మొద‌టి వారం త‌ర్వాత టెన్త్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించుకోవ‌చ్చ‌ని న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది. జూన్ 3న ప‌రిస్థితిని స‌మీక్షించి నివేదిక ఇవ్వాల‌ని ప్ర‌భుత్వానికి హైకోర్టు ఆదేశించింది. అప్ప‌టికీ కేసుల తీవ్ర‌త పెరిగితే..ప‌రిస్థితుల‌ను బట్టి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని హైకోర్టు వెల్ల‌డించింది.
ఇదిలా ఉంటే ఏపీలో మాత్రం జూలైలో 10 ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌భుత్వం తెలిపింది. క‌రోనా తీవ్ర‌త‌ను బ‌ట్టి షెడ్యూల్ ప్ర‌క‌టిస్తామ‌ని మంత్రి ఆదిమూల‌పు సురేష్ వెల్ల‌డించారు. క‌రోనా కార‌ణంగా తెలుగు రాష్ట్రాల్లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు వాయిదా ప‌డుతూ వ‌చ్చాయి. ఇలాంటి త‌రుణంలో ప‌రీక్ష‌లు కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల‌కు తెలంగాణ హైకోర్టు గుడ్‌న్యూస్ చెప్పింది. వ‌చ్చే నెల‌లోనే ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని ప‌చ్చ‌జెండా ఊపింది.

Post a Comment

Previous Post Next Post