Wednesday, May 20, 2020

అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన భట్టి విక్రమార్క

అశ్వరావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం అన్నపురెడ్డిపల్లి మండలంలో అబ్బుగూడెం గ్రామంలో ఇటీవల అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అగ్ని ప్రమాదం వల్ల పూర్తిగా దగ్ధమైన వల్ల పూర్తిగా దగ్ధమైన 16 ఇళ్లను పరిశీలించి బాధితులను పరామర్శించారు.
 బాధితులు నివసించేందుకు నిలువ నీడ లేక పోవడంతో వారి ఇబ్బందులను గమనించి వెంటనే కలెక్టర్ ఎం వీ రెడ్డికి ఫోన్ లో లో  విషయం తెలిపి ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద ఇళ్లు మంజూరు చేయాలని, వారికి నిత్యావసర సరుకులు అందజేయాలని సూచించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి నిత్యావసర సరుకులు అందజేశారు.
 ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా డిసిసి అధ్యక్షులు పువాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, భద్రాద్రి కొత్త కొత్తగూడెం జిల్లా డి సి సి అధ్యక్షులు పోడెం వీరయ్య, ములకలపల్లి జడ్పిటిసి సున్నం నాగమణి,ఖమ్మం జిల్లా ఓబీసీ సెల్ చైర్మన్ పుచ్చకాయల వీరభద్రం, ఎడవల్లి కృష్ణ, ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment