Thursday, May 28, 2020

ఎవ‌రెస్టు ఎత్తు త‌గ్గిందా?! చైనా మ‌ళ్లీ ఎందుకు లెక్కేస్తుంది..?

ఢిల్లీ:
ఎవ‌రెస్టు శిఖ‌రం ఎత్తు ను కొలిచేందుకు మ‌రోసారి చైనాకు చెందిన స‌ర్వేయ‌ర్లు బృందం ఎవ‌రెస్టును అధిరోహిస్తోంది. కోవిడ్ -19  మ‌హ‌మ్మారి త‌లెత్తిన త‌ర్వాత ఎవ‌రెస్ట్ శిఖ‌రాన్ని అధిరోహిస్తున్న తొలి బృందం ఇదే. ప్రస్తుతం ఆ బృందం శిఖ‌రంపై ఉన్న‌ట్టు చైనా సెంట్ర‌ల్ టెలివిజ‌న్ ప్ర‌సారం చేస్తున్న దృశ్యాల ద్వారా తెలుస్తోంది. 
కోవిడ్ -19 నేప‌థ్యంలో  చైనా కేవ‌లం త‌మ దేశస్థుల‌కు మాత్ర‌మే ఎవ‌రెస్ట్ ప్ర‌యాణానికి అనుమ‌తించింది. అటు నేపాల్ అన్ని ర‌కాల ప‌ర్వ‌తారోహ‌ణ కార్య‌క్ర‌మాల‌ను ర‌ద్దు చేసింది. అంటే ఈ ఏడాది ఎవ‌రెస్ట్‌ను అధిరోహించే వారిలో విదేశీయులు లేన‌ట్టే విధంగా తెలుస్తోంది. ఎవ‌రెస్టు అటు నేపాల్ - ఇటు చైనా స‌రిహ‌ద్దుల్లో ఉంది. రెండు వైపుల నుంచి  శిఖ‌రాన్ని ఎక్క‌వ‌చ్చు. 
బుధ‌వారం అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత అంటే 2 గంట‌ల 10 నిమిషాల స‌మ‌యంలో 8,300 మీటర్ల ఎత్తులో ఉన్న క్యాంప్ నుంచి అధిరోహ‌కుల బృందం త‌మ ప్ర‌యాణాన్ని ప్రారంభించింద‌ని చైనాకు చెందిన షిన్హునా వార్తా సంస్థ తెలిపింది. 
అనేక వాతావ‌ర‌ణ అననుకూల ప‌రిస్థితుల మ‌ధ్య గ‌త ఏప్రిల్ నెల‌లో త‌మ ప్ర‌యాణాన్ని ప్రారంభించింది ఈ బృందం.  వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల్లో అనిశ్చితి, త‌గినంత‌గా ఆక్సిజ‌న్ లేని కార‌ణంగా వారి బృందంలోని ఇద్ద‌రు స‌ర్వేయ‌ర్లు మ‌ధ్య‌లోనే తిరుగుముఖం ప‌ట్టార‌ని కూడా షిన్హువా వార్తా సంస్థ వెల్ల‌డించింది.
చైనీయులు మాత్ర‌మే ఎవ‌రెస్ట్ శిఖ ప్ర‌యాణం చెయ్య‌డం చాలా అరుదైన సంద‌ర్భం అని ప‌ర్వాత‌హ‌కుల రికార్డుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు న‌మోదు చేసే ప‌రిశీల‌కులు వ్యాఖ్యానించారు. 
1960 లో కేవ‌లం చైనీయులు మాత్ర‌మే ఎవ‌రెస్ట్‌ను చేరుకోగ‌లిగారు. భార‌తీయులు ప్ర‌య‌త్నిం చిన‌ప్ప‌టికీ విఫ‌ల‌మ‌య్యారు. అని హిమాల‌య అధిరోహ‌కుల వివ‌రాల‌ను భ‌ద్ర‌ప‌రిచే సంస్థ‌కు చెందిన రిచ‌ర్డ్ శాల్సిబ‌రీ అన్నారు. 
క్వారంటైన్ త‌ప్ప‌నిస‌రి కావ‌డం, అలాగే  లాక్‌డౌన్ కార‌ణంగా టిబెట్‌కు వ‌చ్చే విమాన స‌ర్వీసుల‌న్నీ ర‌ద్దు కావ‌డంతో ఈ ఏడాది ఎటువంటి ప‌ర్వ‌తాహ‌రోహ‌ణ కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటు చేయ‌లేక‌ పోయామ‌ని ప‌శ్చ‌మి దేశాల‌కు చెందిన ప‌ర్వాతారోహ‌క నిర్వ‌హాక సంస్థ‌లు తెలిపాయి. 
 

ఈ యాత్ర చాలా ముఖ్య‌మైన‌ది: చైనా స‌ర్వేయ‌ర్లు

ఈ సారి చైనా ప‌ర్వ‌తాహ‌రోహ‌కులు చేస్తున్న యాత్ర చాలా ముఖ్య‌మైన‌ది. ఎందుకంటే వారు ఎవ‌రెస్ట్ ఎత్తును మ‌రోసారి కొలుస్తున్నారు. 2005లో చైనా చేప‌ట్టిన కొల‌త‌ల ప్ర‌కారం ఎవ‌రెస్ట్ ఎత్తు దానిపై క‌ప్ప‌బ‌డిన మంచుతో క‌లిపి 8,844.43 మీట‌ర్లు. అయితే నేపాల్ మాత్రం ఎవ‌రెస్ట్ ఎత్తు 8,884 మీట‌ర్ల‌నే చెబుతోంది. బ్రిటీష్ కాలంలో స‌ర్వేఆఫ్ ఇండియా నిర్ణ‌యించిన ఎత్తునే ఆ దేశం ఇప్ప‌టికీ ప్రామాణికంగా తీసుకుంటోంది. 2015 లో సంభ‌వించిన భూకంపం హిమాల‌యాల‌పై ఏ మేర‌కు ప్ర‌భావం చూపింద‌న్న విష‌యాన్ని ఇంకా ప‌రిశీలించాల్సి ఉంది. బ‌హుశా శిఖరంపై మంచుతో క‌ప్ప‌బ‌డి ఉన్న ప్రాంతం కొంత మేర కుంగి ఉండొచ్చ‌ని కొంద‌రు భౌగోళిక శాస్త్ర‌వేత్త‌లు భావిస్తున్నారు. భూకంపం కార‌ణంగా ఎవ‌రెస్ట్ శిఖ‌రానికి 200 అ డుగులు దిగువ భాగాన ఉండే హిల్ల‌రీ స్టెప్ క‌నుమ‌రుగైపోయింద‌ని కొంత మంది ప‌ర్వ‌తారోహ‌కులు చెబుతున్నారు. కానీ నేపాల్ ప్ర‌భుత్వం మాత్రం అటువంటిదేమీ లేద‌ని చెబుతోంది.

2017 లో నేపాల్ ప్ర‌యత్నాలు...

నేపాల్ ప్ర‌భుత్వం 2017 లో అంత‌ర్జాతీయ సంస్థ‌ల సాయంతో ఎవ‌రెస్ట్ శిఖ‌రం ఎత్తును గ‌ణించే ప్ర‌య‌త్నాల‌ను మొద‌లుపెట్టింది. సంప్ర‌దాయ‌, అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉప‌యోగించి దాదాపు స‌మాచారం మొత్తాన్ని సేక‌రించింది. 
"ఇక చివ‌రిగా చేయాల్సిన ప‌నులు మాత్ర‌మే ఉన్నాయి." అని నేపాల్ డిపార్ట‌మెంట్ ఆఫ్ స‌ర్వే విభాగానికి చెందిన అధికార ప్ర‌తినిధి దామోద‌ర్ ఢ‌క‌ల్ చెప్పారు. 
"ఓ అంత‌ర్జాతీయ వ‌ర్క్ షాపును ఏర్పాటు చేసి అందులో ఆ వివ‌రాల‌ను ప్ర‌జ‌ల‌కు వెల్ల‌డించాల‌న్న‌ది మా ఆలోచ‌న‌. కానీ కోవిడ్ -19 వ‌ల్ల విధించిన లాక్‌డౌన్ కార‌ణంగా ఆ ప్రక్రియ ఆల‌స్య‌మ‌వుతోంది. అని ఆయ‌న తెలిపారు. గ‌త ఏడాది అక్టోబ‌ర్ లో చైనా అధ్య‌క్షుడు  నేపాల్ ప‌ర్య‌టించిన సంద‌ర్భంలో త‌మ రెండు దేశాలు క‌లిసి ఆ వివ‌రాల‌ను వెల్ల‌డిస్తామ‌ని ఒక సంయుక్త ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశాయి. 
ఒక వేళ వేర్వేరుగా ఫ‌లితాలొచ్చిన ప‌క్షంలో రెండు దేశాలు క‌లిసి ఒక ఒప్పందానికి ఎలా వ‌స్తాయ‌న్న విష‌యంలో ఇప్ప‌టికీ ఎలాంటి స్ప‌ష్ట‌త లేదు. 
చైనా ఇప్ప‌టి వ‌ర‌కు రెండు సార్లు అంటే 1975, 2005లో ఎవ‌రెస్ట్ ఎత్తును కొలిచింది.
1975లో ఎవ‌రెస్ట్ అధిరోహించిన బృందంలో ఓ మ‌హిళ కూడా ఉన్నారు. చైనా త‌ర‌పున ఆ శిఖ‌రాన్ని అధిరోహించిన తొలి మ‌హిళ‌గా ఆమె రికార్డుల‌కెక్కారు. హిమాల‌యాన్ డేటాబేస్ అందించిన వివ‌రాల ప్ర‌కారం 2005లో శిఖర ప్ర‌యాణం చేసిన చైనా స‌ర్వేయ‌ర్ల బృందం శిఖ‌రంపై జీపీఎస్‌ను ఏర్పాటు చేసింది. అయితే ఈ సారి చైనా స‌ర్వేయ‌ర్ల బృందం అమెరికాకు చెందిన జీపీఎస్‌కు బ‌దులు త‌న సొంత నేవిగేష‌న్ వ్య‌వ‌స్థ బైదుని వినియోగిస్తోంది. 

No comments:

Post a Comment