Wednesday, May 27, 2020

దుర‌దృష్టం: అప్పుడే వేసిన బోరు బావిలో ప‌డ్డ బాలుడు

మెద‌క్: మెద‌క్ జిల్లాలో మూడేళ్ల బాలుడు ప్ర‌మాద‌వ‌శాత్తు బోరుబావిలో ప‌డిపోయాడు. జిల్లాలోని పాప్ప‌న‌పేట మండ‌లం పోడ్చ‌న్‌ప‌ల్లిలో పంట పొలాల్లో సాగుకోసం కొత్త‌గా బోరు ఏర్పాటు చేయ‌గా, సాయి వ‌ర్థ‌న్ అనే బాలుడు అందులో ప‌డిపోయాడు. బోరు వేసిన అర‌గంట‌లోనే ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. మంగ‌ళి భిక్ష‌ప‌తి అనే వ్య‌క్తి త‌న పొలంలో బోరు వేయించాడు. అయితే, బోరు నుంచి నీళ్లు రాక‌పోవ‌డంతో దాన్ని అలాగే వ‌దిలేశారు. బోరు వేసిన త‌ర్వాత బాలుడి త‌ల్లిదండ్రులు ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. అదే స‌మ‌యంలో బాలుడు బోరులో ప‌డ్డాడు. బోరు వేసిన చోట కేసీంగ్ వేయ‌క‌పోవ‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. బోరుబావిలో ప‌డిన బాలుడు భిక్ష‌ప‌తి కుమారుడిగా గుర్తించారు. గ్రామ‌స్థులు ఇచ్చిన స‌మాచారంతో అక్క‌డికి చేరుకున్న అధికారులు, పాపన్న‌పేట పోలీసులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. బాలుడిని బ‌య‌ట‌కు తీసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.  మ‌రోవైపు విష‌యం తెలుసుకున్న క‌లెక్ట‌ర్ ధ‌ర్మారెడ్డి, ఎస్పీ చంద‌నా దీప్తి, ఆర్‌డి సాయిరాం ఘ‌ట‌నా స్థ‌లం వ‌ద్ద‌కు చేరుకున్నారు. బాలుడిని బ‌య‌ట‌కు తీసేందుకు చేప‌ట్టిన స‌హాయ‌క చ‌ర్య‌లు స‌మీక్షిస్తున్నారు. మొత్తంగా అక్క‌డ టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. 

No comments:

Post a Comment