Monday, May 25, 2020

వ‌రంగ‌ల్ క్రైంః బ‌ర్త్‌డేకు పిలిచి..వీడుతున్న మిస్ట‌రీ

  • నిద్ర‌మాత్ర‌లు క‌లిపి..?
  • ప్రాణం ఉండ‌గానే బావిలో ప‌డేసి..

వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్ గొర్రెకుంట‌లో 9 మంది బావిలోశ‌వ‌మై తేలిన ఘ‌ట‌న‌లో మిస్ట‌రీ వీడుతోంది. నిందితుల్లో ఒక‌రైన బీహార్ కు చెందిన సంజీవ్ యాద‌వ్ నేరం అంగీక‌రించిన‌ట్టు తెలుస్తోంది. కుటుంబగొడ‌వ‌ల‌తో మ‌క్సూదే అందరినీ చంపి బావిలో ప‌డేశాడ‌ని తొలుత అనుమానించినా ఆదివారం సంజ‌య్ నేరం ఒప్పుకున్న‌ట్టు స‌మాచారం. ఆఫీస‌ర్లు మాత్రం క‌న్ఫ‌మ్ చేయ‌లేదు. గొర్రెకుంట బావిలో గురువారం మ‌హ్మ‌ద్ మ‌క్సూద్‌(56), ఆయ‌న భార్య నిశా(46), కూతురు బుస్రా (22), మూడుళ్ల మ‌న‌వుడు బ‌బ్లూ మృత‌దేహాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. మ‌క్సూద్ కొడుకులు షాబాద్ ఆలం (21), సోహైల్ ఆలం(19) తో పాటు బీహార్‌కు చెందిన శ్రీ‌రామ్‌(21), శ్యామ్‌(21) జాడ క‌నిపించ‌క‌పోవడంతో వాళ్ల‌ది హత్యేన‌ని భావించారు. కానీ శుక్ర‌వారం ఈ న‌లుగురి డెడ్ బాడీలు, డ్రైవ‌ర్ ష‌కీల్ మృత‌దేహం బావిలో తేల‌డంతో సంచ‌ల‌న‌మైంది. 
నిద్ర‌మాత్ర‌లు క‌లిపి..?
త‌న బ‌ర్త్‌డే ఉంద‌ని చెప్పి గ‌త బుధ‌వారం 9 మందిని సాయినాథ్ ట్రేడ‌ర్స్ కు సంజ‌య్ యాద‌వ్ పిలిపించి న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌క్సూద్ కూతురు బుస్రాతో ఆయ‌న‌కు వివాహేత‌ర సంబంధం ఉంద‌ని, ఇత‌ర ఆర్థిక లావాదేవీల విష‌యంలో ఇదివ‌ర‌కే గొడ‌వ జ‌రిగిన‌ట్టు తెలిసింది. దీంతో బ‌ర్త్‌డే పేరుతో అంద‌రినీ పిలిచిన‌ట్లు చెబుతున్నారు. వారితో పాటు త‌న అన్ని విష‌యాలు తెలిసిన ష‌కీల్‌ను మ‌క్సూద్ ద్వారా పిలిపించారంటున్నారు. త‌ర్వాత అంద‌రికీ కూల్ డ్రిక్స్ లో నిద్ర‌మాత్ర‌లు క‌లిపి ఇచ్చి స్పృహ కోల్పోయాక గోనె సంచిలో ఈడ్చుకెళ్లి ప‌క్క‌నున్న బావిలో ప‌డేసిన‌ట్టు పోలీసులు ప్రాథ‌మిక నిర్థార‌ణ‌కు వ‌చ్చారు. సంఘ‌ట‌న స‌మ‌యంలో సంజ‌య్‌తో పాటు ఇంకొంద‌రూ ఫ్రెండ్స్ కూడా ఉన్న స‌మాచారం. బుస్రాతో స‌న్నిహితంగా మెలిగిన మిద్దెపాక యాకూబ్ హ‌స్తం కూడా ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. సంజ‌య్‌పాత్ర‌పై సోమ‌వారం స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది. 
ప్రాణం ఉండ‌గానే బావిలో ప‌డేసి..
మృత‌దేహాల‌పై గీరుకుపోయిన గాయాలున్న‌ట్టు పోస్టుమార్టం త‌ర్వాత డాక్ట‌ర్లు చెప్పారు. ఈడ్చుకెళ్తుంటే అయిన‌ట్టు గాయాలున్నాయ‌న్నారు. అంద‌రినీ ప్రాణం ఉండ‌గానే బావిలో ప‌డేసి ఉంటార‌ని, సామూహిక ఆత్మ‌హ‌త్య‌లు కావ‌ని గుర్తించారు. మృతుల ఊపిరితిత్తుల్లోకి నీళ్లు వెళ్లిన‌ట్టు పోస్టుమార్టంలో గుర్తించారు. బ‌తికుండ‌గానే బావిలో ప‌డేస్తే ఊప‌రితిత్తుల్లోకి నీళ్లు పోయే అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి మ‌త్తు మందు క‌లిపి అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లాకే బావిలో ప‌డేసి  ఉంటార‌ని చెబుతున్నారు. పోస్టుమార్టం టైమ్‌లో గ‌మ‌నించిన విష‌యాలు ప్ర‌కారం మ‌త్తు ప‌దార్థాలు, విష ప్ర‌యోగం జరిగి ఉంటుంద‌నే అనుమానంతో మృత‌దేహాల ఊప‌రితిత్తులు, కిడ్నీలు, పొట్ట‌బాగాల‌నుఫోరెన్సిక్ టెస్టుకోసం పంపారు. సాయినాథ్ ట్రేడ‌ర్స్‌లోని  ఇంట్లో ఫుడ్‌, డ్రింక్స్‌, బియ్యం త‌దిత‌ర శాంపిల్స్‌ను కూడా ల్యాబ్‌కు పంపారు. 

No comments:

Post a Comment