హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం బుధవారం కరోనా వైరస్ విషయమై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. తాజాగా బుధవారం 27 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఈరోజు ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 1661 కేసులు నమోదయ్యాయి. ఎప్పటి వరకు 40 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం యాక్టివ్గా 609 కేసులు ఉన్నాయి. ఈ రోజు ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 1013మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈరోజు నమోదైన పాజిటివ్ కేసుల్లో జిహెచ్ఎంసి పరిధిలో 15,12 పాజిటివ్ కేసులు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారికి ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారిలో 89 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.

Post a Comment

Previous Post Next Post