Wednesday, May 27, 2020

క‌రోనా వైర‌స్ కంటే..సైకిల్ జ్యోతిపైనే చ‌ర్చ‌.. పీప్లీ లైవ్..సినిమాను త‌లపిస్తోన్న చిన్న ఇల్లు..!

బీహార్ (Bihar)
సైకిల్ జ్యోతి..త‌న తండ్రిని 1200 కిలోమీట‌ర్లు సైకిల్ తొక్కుతూ త‌న సొంత గ్రామానికి తీసుకెళ్లిన ఉక్కు బాలిక‌. ప్ర‌‌స్తుతం ఈ పేరు దేశంలో రాష్ట్రాల‌ను తాకి, ప్ర‌పంచ దేశాలకు ఆమె వార్త వినిపిస్తోంది. ప్ర‌స్తుతం వారి ఇంటి వ‌ద్ద ఉన్న ప‌రిస్థితిని చూసి జ్యోతి త‌ల్లి ఫూలో దేవి 2010 నాటి సినిమా పీప్లీ లైవ్ గుర్తుకు వ‌స్తుంద‌ని ఆనంద‌ప‌డుతోంది.
పేద‌రికంతో నిరాశ‌లో కూరుకుపోయిన రైతు న‌థా ఆ సినిమాలో ఆత్మ‌హ‌త్య చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తాడు. దీంతో మీడియా, నాయ‌కుల దృష్టి అత‌డిపై ప‌డుతుంది. సినిమా చివ‌ర్లో అత‌డు గురుగ్రామ్‌లో ప‌నిలో త‌ల మున‌క‌లై క‌నిపిస్తాడు.
జ్యోతి తండ్రి మోహ‌న్ పాస్‌వావ్ కూడా కొన్ని నెల‌ల ముందు వ‌ర‌కూ గురుగ్రామ్‌లో బ్యాట‌రీ రిక్షా న‌డిపేవారు. అంతేకాదు జ్యోతి ఇప్పుడుంటున్న ఇల్లు కూడా ఓ చిన్న గ‌ది. వ‌రండాతో అచ్చంగా పీప్లీ లైవ్ సినిమాలో వేసిన సెట్‌లానే ఉంటుంది. ఈ చిన్న ఇంట్లో ఇప్పుడు 40 నుంచి 50 మంది గుమ్మిగూడుతున్నారు.
కొంద‌రు నాయ‌కులు, మ‌రికొంద‌రు మీడియా ప్ర‌తినిధులు, ఇంకొంద‌రు సామాజిక కార్య‌క‌ర్త‌లు, ఇంకా ప్ర‌భుత్వ అధికారులు, ఇలా అంద‌రూ జ్యోతి జీవితం గురించి తెలుసుకోవ‌వాల‌ని అనుకుంటున్నారు. 
క‌రోనా వైర‌స్ భ‌యంతో గ‌జ‌గ‌జ వ‌ణుకుతున్న ఈ రోజుల్లో ఇక్క‌డ‌కు వ‌చ్చేవారు కొంచెం సంతోషంగానూ క‌నిపిస్తున్నారు. 
"మా ఇల్లు చాలా చిన్న‌ది.  అందుకే ప‌క్క‌నే చిన్న టెంట్ వేస్తున్నాం. క‌రోనా వైర‌స్ సోకుతుందోమోన‌నే భ‌యం కూడా ఉంది. అయితే ఎవ‌రినైనా రావొద్ద‌ని అంటే..గ‌ర్వం బాగా పెరిగిపోయింద‌ని అనుకుంటారు. అందుకే  ప‌క్క‌నే ఓ టెంట్ వేస్తున్నాం. అక్క‌డ‌కు అంద‌రూ వ‌చ్చి మా అమ్మాయిని ఆశీర్వ‌దించొచ్చు." అని జ్యోతి తండ్రి మోహ‌న్ పాస్‌వాన్ మీడియాకు వివ‌రించారు.
నిజానికి బీహార్ ద‌ర్భంగ జిల్లాలోని సిర్హుల్లీ గ్రామంలో క‌రోనా వైర‌స్‌పై కంటే జ్యోతిపైనే ఎక్కువ చ‌ర్చ జ‌రుగుతోంది. ఇక్క‌డ సామాజిక దూరం, సోష‌ల్ డిస్టెన్సింగ్ లాంటి మాట‌లు  అందుకే విన‌ప‌డ‌ట్లేదు.
జ్యోతీకి ల‌డ్డూలు తినిపించేందుకు, శాలువాలు క‌ప్పేందుకు, బ‌ట్ట‌లు ఇచ్చేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు నాయ‌కులు, మంత్రులు, స్వ‌చ్ఛంధ సంస్థ‌లు, ప్ర‌భుత్వ ప్ర‌తినిధులు వ‌స్తున్నారు. వారెవ‌రూ కోవిడ్‌-19  గురించి అస‌లు ప‌ట్టించుకోవ‌డ‌మే లేదు. 
ప్రస్తుతం జ్యోతి మాస్క్ వేసుకొని హోమ్ క్వారంటైన్‌లో ఉంది. అయితే ఆమెను చూడ‌టానికి వ‌చ్చేవారు మాత్రం ఎలాంటి సామాజిక దూరం నిబంధ‌న‌లూ పాటిస్తున్న‌ట్లు లేదు. ఈ విష‌యంపై జ్యోతితో మాట్లాడితే.. "మేం ఎవ‌రితోనూ ఏమీ మాట్లాడ‌ట్లేదు. ఏం చేయ‌గ‌లం." అని ఆమె అల‌సిన స్వ‌రంతో స‌మాధానం ఇచ్చింది. 
తిన‌డానికి కూడా స‌మ‌యం లేదు:జ్యోతి త‌ల్లి
ఉద‌యం 7 గంట‌ల నుంచే జ్యోతి ఇంటికి జ‌నాలు వ‌స్తున్నారు. రాత్రి 8 గంట‌ల వ‌ర‌కూ ఇలా అతిథుల‌తోనే ఆమె ఇల్లు నిండిపోతోంది. భ‌గ‌భ‌గ మంటున్న ఎండ వేడికి త‌ట్టుకోలేక పాస‌వాన్ ఓ కొత్త ఫ్యాన్ కూడా కొన్నారు.
"మా అమ్మాయి నిద్ర స‌రిగా పోవ‌ట్లేదు. తిండి కూడా స‌మ‌యానికి తిన‌లేక‌పోతోంది. అయినా కూడా విసుక్కోవ‌డం లేదు. అంద‌రినీ సంతోషంగానే ప‌ల‌క‌రిస్తోంది." అని జ్యోతి త‌ల్లి ఫూలో వివ‌రించారు. 
చాలా సంతోషంగా ఉంద‌ని, అయితే నిద్ర స‌రిపోవ‌ట్లేద‌ని జ్యోతి కూడా  మీడియాకు వివ‌రించింది. అంద‌రి ఫోన్‌కాల్స్ మాట్లాడాల‌ని, ఎవ‌రిపైనా విసుక్కోవ‌ద్ద‌ని నాన్న చెప్పిన‌ట్టు ఆమె వివ‌రించింది. 
జ్యోతి మా స్కూల్ కే గ‌ర్వ‌కార‌ణం...
15 ఏళ్ల జ్యోతి.. చ‌ద‌వులో ఒక స‌గ‌టు విద్యార్థిని. 2017 లో ఆమె సిర్హుల్లీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో 8వ త‌ర‌గ‌తి పాస్ అయ్యింది. ఆమె పాఠ‌శాల ప్రిన్సిపాల్ ర‌త్నేశ్వ‌ర్ ఝూ..మాట్లాడుతూ.. చ‌దువులో జ్యోతి ఒక స‌గ‌టు విద్యార్థిని. ఆమెకు స్కూల్లో ని ఇత‌ర అంశాల‌పై అంత ఆస‌క్తి ఉండేది కాదు. అయితే నేడు ఆమె మా స్కూల్ కే గ‌ర్వ‌కార‌ణం.
9వ త‌ర‌గ‌తికి వెళ్లాక జ్యోతి చ‌దువు మానేసిన‌ట్టు అంగ‌న్‌వాడీలో ప‌నిచేస్తున్న ఆమె త‌ల్లి వివ‌రించారు. ఇక్క‌డుంటే పిల్ల‌లంతా ప్ర‌త్యేక ట్యూష‌న్ల‌లో చ‌దువ‌కుంటారు. కానీ మాకు అంత స్థోమ‌త లేదు.
ప్ర‌స్తుతం బీహార్ ప్ర‌భుత్వం ఆమెను 9వ త‌ర‌గ‌తిలో చేర్చుకుంది. అయితే జ్యోతిని ఇంజ‌నీర్‌, డాక్ట‌ర్ లేదా అధికారిని చేస్తామంటూ చాలా సంస్థ‌లు ముందుకు వ‌స్తున్నాయి.
మ‌రో వైపు స్లైకింగ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా కూడా జ్యోతిని ఢిల్లీకి ఆహ్వానించింది. దీంతో ఆమె ఓ సైక్లిస్ట్‌గా మారే అవ‌కాశాలూ లేక‌పోలేదు. 
ప్రస్తుతం జ్యోతి చాలా దూరం సైకిల్ తొక్క‌డంతో జ్యోతి వెన్నుకు గాయ‌మైంది. ప్ర‌స్తుతం ఆమె చికిత్స తీసుకుంటోంది. దీంతో ఓ నెల రోజులు గడువు ఇవ్వాల‌ని సైక్లింగ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియాను ఆమె కోరింది. 
సైకిళ్ల‌తో కిక్కిరిస‌న ఇల్లు..
జ్యోతి ఇంట్లో నేడు శ‌ర‌వేగంగా మ‌రుగుదొడ్డిని నిర్మిస్తున్నారు. మ‌రోవైపు ముఖ్య‌మంత్రి ఆదేశాల‌పై హ‌ర్ ఘ‌ర్ న‌ల్‌జ‌ల్ యోజ‌న కింద మూడు మంచినీళ్ల గొట్టాల‌ను ఏర్పాటు చేస్తున్నారు.
ఒక‌టి మ‌రుగుదొడ్డిలో, మ‌రో రెండు వ‌రండాలో ఏర్పాటు చేస్తున్నారు. ఇంటిలో గ్యాస్ సిలెండ‌ర్ ఉంది. అయితే దాన్ని నింపుకునేందుకు డ‌బ్బులు ఎక్కువ ఖ‌ర్చు కావ‌డంతో.. చాలా వ‌ర‌కు వంట క‌ట్టెల పొయ్యి మీదే చేస్తున్నారు. ప్ర‌స్తుతానికి జ్యోతికి నాలుగు కొత్త సైకిళ్లు వ‌చ్చాయి. అవి చిన్న ఇంట్లో ఎక్క‌వ స్థ‌లం ఆక్ర‌మించాయి.
జ్యోతి చెల్లి మాన‌సి 5వ త‌ర‌గ‌తి చ‌దువుతోంది. త‌మ్ముడు దీప‌క్ 3వ త‌ర‌గ‌తి, చిన్న త‌మ్ముడు ప్రియాన్షు.. అంగ‌న్‌వాడీ కి వెళ్తున్నాడు. 
"ఇంటికి వ‌చ్చేవారు డ‌బ్బులు ఇస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత వ‌చ్చిందో లెక్క పెట్టుకోలేదు. ఈ డ‌బ్బుల‌తో పిల్ల‌ల‌కు మంచి చ‌దువు చెప్పిస్తా.."అని 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దువుకున్న జ్యోతి తండ్రి మోహ‌న్ పాస్‌వాన్ తెలిపారు. జ్యోతిని చూసి కొంద‌రు గ‌ర్వ‌ప‌డుతుంటే.. మ‌రికొంద‌రు ప్ర‌భుత్వం సిగ్గుప‌డాల‌ని అంటున్నారు. 
గ‌త 8రోజుల్లో జ్యోతి జీవితం చాలా మారింది. కానీ బీహార్‌లో చాలా మంది మ‌హిళ‌ల‌ది ఇప్ప‌టికీ అదే ప‌రిస్థితి. రాష్ట్రంలో 60 శాతం మంది మ‌హిళ‌లు ర‌క్త‌హీన‌త‌తో బాధ‌ప‌డుతున్నారు. మ‌హిళ‌లు, బాలిక‌లు ఇలా అంద‌రూ స‌మాజంలో ఒకేలా జీవించే అవ‌కాశం క‌ల్పించే బాధ్య‌త ప్ర‌భుత్వానిదే క‌దా..?



No comments:

Post a Comment