Tuesday, May 19, 2020

కందిపొట్టు బస్తాల కింద‌..నిఘా పెట్టి ప‌ట్ట‌కున్న పోలీసులు

గుంటూరు: అంత‌ర్‌రాష్ట్ర చెక్ పోస్టుల వ‌ద్ద గుంటూరు రూరల్ పోలీసులు ప‌టిష్ట నిఘా పెట్టారు. మొన్న రూ.5 ల‌క్ష‌ల అక్ర‌మ మ‌ద్యం, నిన్న రూ.6ల‌క్ష‌ల అక్ర‌మ మ‌ద్యం..నేడు అన‌గా మంగ‌ళ‌వారం రూ.3.5 ల‌క్ష‌ల నిషేధిత గుట్కా  ప్యాకెట్ల‌ను చాక‌చ‌క్యంగా పోలీసులు ప‌ట్ట‌కున్నారు. 
తెలంగాణ‌- ఆంధ్ర రాష్ట్రాల‌ను క‌లుపుతూ నాగార్జున‌సాగ‌ర్ అంత‌ర్‌రాష్ట్ర బోర్డ‌ర్  చెక్‌పోస్ట్ వ‌ద్ద ఉద‌యం 7 గంట‌ల స‌మ‌యంలో ఐస‌ర్ మినీ లారీ కందిపొట్టు బ‌స్తాలు లోడ్ వేసుకొని హైద‌రాబాద్ నుండి ఎర్ర‌గొండ‌పాలెం వైపు వెళ్తుంది. ఈ క్ర‌మంలో సాగ‌ర్ చెక్‌పోస్టు వ‌ద్ద త‌నిఖీ చేయ‌గా కందిపొట్టు బ‌స్తాల కింద సుమారు రూ.3.50 ల‌క్ష‌ల విలువ చేసే నిషేధిత ఖ‌లేజా ప్లాస్టిక్ బ్యాగ్స్ 50, కె-9 టుబాకో ప్లాస్టిక్ బ్యాగ్స్ 40 మొత్తం 90 ప్లాస్టిక్ బ్యాగ్స్‌ను ప‌ట్ట‌కుని స్టేష‌న్‌కు త‌ర‌లించారు. నిందితులు హైద‌రాబాద్‌కు చెందిన వారుగా గురించారు. 
గుంటూరు రూర‌ల్ జిల్లా ప‌రిధిలో చెక్‌పోస్టుల వ‌ద్ద స‌మ‌ర్థ‌వంత‌ముగా విధులు నిర్వ‌రిస్తూ అక్ర‌మ మ‌ద్యం, నిషేధిత గుట్కా ర‌వానా జ‌రుగకుండా అరిక‌డుతున్న పోలీస్ అధికారుల‌కు , సిబ్బందికి గుంటూరు రూర‌ల్ ఎస్పీ సిహెచ్ విజ‌య‌రావు రివార్డులు ప్ర‌క‌టించ‌నున్నారు. 

No comments:

Post a Comment