Saturday, May 30, 2020

మిర్చికి బూజు..ఖ‌మ్మంలో రైత‌న్న‌ల టెన్ష‌న్‌..!

ఖ‌మ్మం(Khammam):
ఆరుగాలం శ్ర‌మించి, అప్పులు చేసి మ‌రీ పండించిన పంట‌కు గిట్టుబాటు ధ‌ర లేక‌, మ‌రికొంత కాలం ఓపిక చేద్ధాం.. అనుకున్న మిర్చి రైత‌న్నకు భంగ‌పాటు త‌ప్ప‌లేదు. కోల్డ్ స్టోరేజీలో పెట్టిన మిర్చి బ‌స్తాల్లో కొన్ని బూజు ప‌ట్టి ఉంట‌డంతో రైత‌న్న‌ల‌కు క‌న్నీళ్లే మిగిలే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. విష‌యానికి వ‌స్తే...కోల్డు స్టోరేజీల్లో  రైతులు నిల్వ చేసిన మిర్చి బూజు ప‌డుతున్న  సంఘ‌ట‌న‌లు ఇటీవ‌ల వెలుగులోకి వ‌స్తున్నాయి. ఈ విష‌యంలో కోల్డ్‌స్టోరేల నిర్వ‌హాకుల‌దే త‌ప్ప‌ని రైతులు, కాదు నిల్వ‌చేసే స‌మ‌యంలోనే స‌రైన ప్ర‌మాణాలు పాటించ‌కుండా రైతులే ఇష్టారీతిన బ‌స్తాల్లో మిర్చిని తొక్క‌డం వ‌ల్లే ఇదంతా జ‌రుగుతోంద‌ని కోల్డు స్టోరేజీల నిర్వ‌హాకులు వాగ్వివాదానికి దిగుతుండ‌టంతో జిల్లాలోఆయా ప్రాంతాల్లో కోల్డ్ "వార్ ఘాటెక్కుతోంది. ఏసీలో ఉంచిన పంట‌కు బూజు వ‌స్తున్న సంఘ‌ట‌న‌లు ఇటీవ‌ల వ‌రుస‌గా వెలుగులోకి రావ‌డంతో అధికారులు రంగంలోకి దిగారు. త‌ప్పెవ‌రిదో తేల్చేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న కోల్డ్ స్టోరేజీల్లో త‌నిఖీలు నిర్వ‌హించి స‌మ‌గ్ర నివేదిక‌ను క‌లెక్ట‌ర్‌కు అందించారు. ఖ‌మ్మం జిల్లా వ్యాప్తంగా 37 కోల్డ్ స్టోరేజీలు ఉండగా ఒక్కోదాంట్లో ల‌క్ష‌కు పైగా బ‌స్తాలు నిల్వ ఉంచే సామ‌ర్థ్యం ఉంది.ఈ ఏడాది 50 వేల ఎక‌రాల్లో మిర్చి సాగైంది. ఆ మిర్చి చేతికొచ్చే స‌మ‌యానికి క‌రోనా వ‌ల్ల లాక్‌డౌన్ విధించ‌డంతో మార్కెట్‌లో అమ్మ‌కాలు నిలిచిపోయాయి. దీంతో రైతులంతా కోల్డ్ స్టోరేజీల‌ను ఆశ్ర‌యించ‌డంతో దాదాపు అన్నీ నిండిపోయాయి. ఆ త‌ర్వాత రెండు నెల‌ల అనంత‌రం లాక్‌డౌన్ స‌డ‌లింపులు రావ‌డంతో రైతులు తాము నిల్వ‌చేసిన పంట ఎలా ఉందోన‌ని చూసుకునేందుకు కోల్డ్‌స్టోరేజీల‌కు వ‌స్తున్నారు. వారు బ‌స్తాల‌ను ప‌రిశీలించ‌గా కొంద‌రి బ‌స్తాల్లోబూజు ప‌ట్ట‌డాన్ని గ‌మనించి కోల్డ్‌స్టోరేజీల నిర్వాహ‌కుల‌తో వాగ్వాదానికి దిగ‌డం, పోలీసులు జోక్యం చేసుకొని ఇరువ‌ర్గాల‌కు న‌చ్చ‌జెప్ప‌డం లాంటి సంఘ‌ట‌న‌లు జిల్లాలో జ‌రుగుతున్నాయి. బాగా ఆరిన‌, పొడిగా ఉన్న మిర్చిని శుభ్రంగా పొడిగా ఉన్న గోనెసంచుల్లో నింపి తేమ నుంచి ర‌క్ష‌ణ క‌ల్పించేలా నిల్వ చేసిన‌ప్పుడే పంట‌కు గిట్టుబాటు ధ‌ర వ‌స్తుంది. అలా గిట్టుబాటు ధ‌ర ల‌భించేవ‌ర‌కూ త‌మ పంట‌ను ఏసీలో నిల్వ చేసుకుంటున్నారు. ప్ర‌స్తుతం మిర్చికి బూజు రావ‌డానికి కార‌ణాలేమిటి? అన్న విష‌యాల‌పై అధికారులు ప‌రిశీల‌న జ‌రుపుతున్నారు. 

No comments:

Post a Comment