విశాఖ‌ప‌ట్ట‌ణం: విశాఖ‌ గ్యాస్ లీకేజీ బాధితుల‌తో సోమ‌వారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి సీఎం వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వీడియోకాన్ఫ‌రెన్స్ లో మాట్లాడారు. ఎల్జీ పాలిమ‌ర్స్ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం చాలా బాధ‌క‌ర‌మ‌ని, ఇలాంటి ఘ‌ట‌న‌లు మ‌ర‌లా పున‌రావృతం కాకుండా చూస్తామ‌ని తెలిపారు. ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు ప్ర‌భుత్వం ఎలా స్పందించాలో నేనుప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు కూడా చెప్పాన‌ని గుర్తు చేశారు. ఓఎన్జీసీ గ్యాస్ లీకై 22 మంది చ‌నిపోయారు. ఈప్ర‌మాదంలో సంస్థ రూ.20 ల‌క్ష‌లు, కేంద్రం రూ.3 ల‌క్ష‌లు, రాష్ట్రం రూ.2 ల‌క్ష‌లు అందించాయ‌ని పేర్కొన్నారు. ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు క‌ఠినంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, కంపెనీల‌కు హెచ్చ‌రిక ఉండేలా ప్ర‌భుత్వాలు స్పందించాల‌ని సూచించారు. ఓఎన్జీసీ ఘ‌ట‌న‌లో బాధితుల‌కు రూ.కోటీ ఆర్థిక‌సాయం ఇవ్వాల‌ని కోరాన‌ని, ఎల్జీ పాలిమ‌ర్స్ ఘ‌ట‌న‌లోనూ నాకు అదే గుర్తొచ్చింద‌ని తెలిపారు. అందుకే ఎక్క‌డా జ‌ర‌గ‌ని విధంగా ప్ర‌భుత్వం వేగంగా స్ప‌దించింద‌న్నారు. క‌లెక్ట‌ర్‌, క‌మిష‌న‌ర్‌తో పాటు 110 అంబులెన్స్‌లు కూడా ఘ‌ట‌న స్థ‌లికి చేరుకున్నాయ‌ని, వెంట‌నే బాధితుల‌ను ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించిన‌ట్లు తెలిపారు. 
రెండు గంట‌ల్లోనే గ్రామాల నుంచి ప్ర‌జ‌ల‌ను ఖాళీ చేయించామ‌ని, అధికారులు స్పందించిన తీరును అభినందిస్తున్న‌ట్టు పేర్కొన్నారు. మంత్రుల‌తో, అధికారుల‌తో క‌మిటీని కూడా ఏర్పాటు చేశామ‌ని, ఇలాంటిఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా రాష్ట్ర‌స్థాయి క‌మిటీని ఏర్పాటుచేశామ‌ని పేర్కొన్నారు. 13 వేల ట‌న్నుల స్టైరిన్‌ను రెండు షిప్‌ల ద్వారా వెన‌క్కి పంపించామ‌ని, ఎల్జీ పాలిమ‌ర్స్‌కు అనుమ‌తి గానీ, విస్త‌ర్ణ గానీ చంద్ర‌బాబు అధికారంలోనే ఉన్న‌ప్పుడే జ‌రిగాని తెలిపారు. అయినా కూడా ఎక్క‌డా రాజ‌కీయాలు ఆరోప‌ణ‌లు చేయ‌డం లేద‌ని పేర్కొన్నారు. మాన‌వతా ధృక్ప‌థంతో బాధితుల‌ను ఆదుకోవాల‌ని మాత్ర‌మేప్ర‌య‌త్నించామ‌న్నారు. 
మీ ఇంట్లో బిడ్డే ముఖ్య‌మంత్రి స్థానంలో ఉన్న‌డాని, ఏ ఒక్క కుటుంబానికి అన్యాయం జ‌ర‌గ‌నివ్వ‌ను అని హామీ ఇచ్చారు. గ్రామాల్లో ప్ర‌త్యేక ఆస్పత్రి ఏర్పాటు చేయాల‌ని ఆదేశించామ‌న్నారు. ప్ర‌జ‌ల‌కు పూర్తిస్థాయిలో వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని ఆదేశించామ‌ని సీఎం జ‌గ‌న్ పేర్కొన్నారు. 

Post a Comment

Previous Post Next Post