మెక్సికో: కరోనా వైరస్ ప్రపంచంలో విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రస్తుతం ప్రపంచం అంతా కరోనా మయం అయిపోయింది. తాజాగా మెక్సికో దేశంలో మాంటోమొరోలెస్ మున్సిపాలిటీలో కరోనా వైరస్ రూపంలో వడగళ్ల వర్షం పడింది. ఆ వడగళ్ల ను చూసిన స్థానిక ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అచ్చం కరోనా వైరస్ ను పోలి ఉన్న వడగండ్లను చూసి స్థానికులు నోరెళ్ళబెడతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు ఇది భగవంతుడు మహిమ అంటుంటే, వాతావరణ శాస్త్ర వేత్తలు మాత్రం ఇది సాధారణమే అని చెబుతున్నారు. భారీ వర్షాల కారణంగా తో కొన్నిసార్లు వడగళ్ళు ఆకాశంలోనే ఢీకొని కొన్ని ఆకృతులతో కింద పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.మెక్సికో తో పాటు మరికొన్ని దేశాల్లో కూడా ఇలా వడగళ్ళు పడ్డాయని తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post