Thursday, May 28, 2020

మ‌రో రెండ్రోజుల్లో మిడ‌త‌ల దండు ఆదిలాబాద్‌కు..?

ఆదిలాబాద్ :
పాకిస్తాన్ నుంచి భార‌త్ లోకి ప్ర‌వేశించిన మిడ‌త‌ల దండు మ‌హారాష్ట్ర మీదుగా తెలంగాణ లోకి ప్ర‌వేశించే అవ‌కాశం ఉంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా స‌రిహ‌ద్ద‌కు దాదాపు 300 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న మిడ‌త‌లు మ‌రో రెండ్రోజుల్లో ఆదిలాబాద్‌కు చేరుకోనున్న‌ట్లు స‌మాచారం. దీంతో ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా అధికారులు మిడ‌త‌ల దండును ఎదుర్కొనేందుకు అప్ర‌మ‌త్త‌మ‌వుతున్న‌ట్లు పేర్కొన్నారు. ఇప్ప‌టికే రాజ‌స్థాన్ , గుజ‌రాత్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో మిడ‌త‌లు పంట‌కు న‌ష్టం క‌లిగించాయి. ఈ క్ర‌మంలో గురువారం మిడ‌త‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అనంత‌పురం జిల్లాకు చేరుకున్నాయి. జిల్లాలో రాయ‌దుర్గంలో వంద‌ల సంఖ్య‌ల్లో ఈ రాకాసి మిడ‌త‌లు క్ష‌ణాల్లో జిల్లేడు చెట్టు ఆకుల‌ను తినేయ‌డం చూసి స్థానికులు, రైతులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. 
పోలీస్ సైర‌న్ల‌తో...పొలాల వెంట పోలీసు జీపులు...!
క‌రోనాతో వ‌ణికిపోతున్న భార‌త్‌కు రాకాసి మిడ‌త‌ల దండు కొత్త త‌ల‌నొప్పిగా మారింది. ఎక్క‌డో తూర్పు ఆఫ్రికా దేశాల నుంచి గుంపులు గుంపులుగా ఖండాలు దాటి వ‌స్తూ పంట‌ల‌ను స్వాహా చేస్తున్నాయి. మ‌న దేశంలోకి ప్ర‌వేశించిన ఈ దండు ను పార‌దోలేందుకు భోపాల్‌లో డీజేలు పెడుతూ పెద్ద శ‌బ్ధాలు చేస్తూ పంట‌ను కాపాడుకునేందుకు రైతులు విశ్వ‌ప్ర‌య‌త్నం చేస్తున్నారు. 
తాజాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ప‌న్నా టైగ‌ర్ రిజ‌ర్వ్  ప్రాంతంలో చెట్లు, పంట‌ల‌ను దాడిచేస్తున్న దండును పార‌దోలేందుకు పోలీస్ జీపుల సైర‌న్ల‌ను ఉప‌యోగించారు. 
పొలాల వెంబ‌డి పోలీస్ జీపుల‌ను న‌డుపుతూ పెద్ధ శ‌బ్ధంతో సైర‌న్‌ల‌ను మోగిస్తూ వాటిని నియంత్రించేందుకు కృషి చేస్తున్నారు. ఈ విష‌యం గురించి ప‌న్నాకు చెందిన వ్య‌వ‌సాయ అధికారి సుమ‌న్ మాట్లాడుతూ.."మిడ‌త‌ల దండు నుంచి పంట‌ల‌ను కాపాడేందుకు ఇది ఎంత‌గానో ఉప‌క‌రిస్తుంది. భారీ శబ్ధాలు లేదా క్రిమిసంహార‌క మందులు పిచిక‌రీ చేయ‌డం ద్వారా రాకాసి దండు బారి నుంచి కాపాడుకోవ‌చ్చు. "అని స‌ల‌హా ఇచ్చారు. 

No comments:

Post a Comment