ఖ‌మ్మం: సీపీఎం నాయ‌కుల‌పై అక్ర‌మ కేసులు బ‌నాయించ‌డాన్ని ఖండిస్తూ వెంట‌నే కేసులు ఉప‌సంహ‌రించుకోవాల‌ని ఆ పార్టీ త్రీటౌన్ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం స్థానిక ప్ర‌జా సంఘాల భ‌వ‌నంలో నిర‌స‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జిల్లా క‌మిటీ స‌భ్యులు య‌ర్రా శ్రీ‌నివాస్‌రావు మాట్లాడుతూ..‌ల‌కు లాక్‌డౌన్ సంద‌ర్భంగా కేంద్ర‌,రాష్ట్ర ప్ర‌భుత్వాలు  నెల‌కు రూ.7,500 రూపాయ‌లు, 25 కేజీల బియ్యం ప్ర‌తిరేష‌న్ కార్డు దారునుకి అంద‌జేయాల‌ని కోరుతూ లాక్‌డౌన్ నిబంధ‌న‌లు పాటిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ ప్ల‌కార్డులు పట్టుకొని ఖ‌మ్మం స‌రితా క్లీనిక్ సెంట‌ర్‌లో నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టామ‌న్నారు. అలాగే సీపీఎం జిల్లా కార్య‌ద‌ర్శి నున్నా నాగేశ్వ‌ర‌రావు, కార్య‌ద‌ర్శి వ‌ర్గ స‌భ్యులు య‌ర్రా శ్రీ‌కాంత్‌, టుటౌన్ కార్య‌ద‌ర్శి వై విక్ర‌మ్‌ల‌తో పాటు మ‌రో 8 మంది కార్య‌క‌ర్త‌ల‌పై అక్ర‌మ కేసులు బ‌నాయించ‌డాన్ని ఖండిస్తున్నామ‌న్నారు. వారిపై కేసును ఉప‌సంహ‌రించుకోవాల‌ని కోరారు. ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మంలో జిల్లా క‌మిటీ స‌భ్యులు య‌ర్రా గోపీ, ప‌త్తిపాక నాగ‌సులోచ‌న‌, వేల్పుల నాగేశ్వ‌రావు, కె.హిమామ్‌, మండ‌ల వీర‌స్వామి, య‌ర్రా న‌గేష్‌, య‌ర్రా వెంక‌న్న‌, మ‌ద్దిశ్రీ‌ను, వేల్పుల మ‌ధు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post