Sunday, May 31, 2020

వింత: ఆ దేశంలో క‌రోనా ఓ ఆదాయ‌ వ‌న‌రుగా మారింది..!

కెన్యా
(kenya): ప్ర‌పంచ‌దేశాలు క‌రోనా అంటే మూడున్నెళ్ల సంధి చిగురుటాకులా గ‌జ‌గ‌జ‌లాడుతున్నాయి. ఎంతో మంది ఈ వైర‌స్ బారిన ప‌డి మృత్యువాత ప‌డ్డారు. మ‌రికొంద‌రు చికిత్స పొందుతూ క‌రోనాతో పోరాడుతున్నారు. రోజురోజుకూ ..కొత్త కొత్త కేసులు పెరుగుతున్నాయి.. ఏం చేయాలో తెలియ‌ని ప‌రిస్థితిలో ప్ర‌పంచ‌దేశాలు లాక్‌డౌన్‌ను విధించుకుని క‌రోనాను క‌ట్ట‌డి చేసే ప్ర‌య‌త్నంలో ఉన్నాయి. 
ఈ నేప‌థ్యంలో వ్యాపారాలు దెబ్బ‌తిని, ఉద్యోగాలు లేకుండా ఇంటికే ప‌రిమిత‌మై ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. కానీ క‌రోనా వైర‌స్ పుణ్య‌మా అని ద‌క్షిణాఫ్రికా ఖండంలో మాత్రం కెన్యా దేశంలో క్షౌర‌శాల‌ల‌కు ఆదాయ మార్గంగా  మారింది. అదేలా అనుకుంటున్నారా?  
ఈ కెన్యా దేశంలోనూ క‌రోనా వైర‌స్ వేగంగానే విజృంభిస్తోంది. క‌రోనా నియంత్ర‌ణ‌లో భాగంగా విధించిన లాక్‌డౌన్‌తో క్షౌర‌శాల‌ల‌కు ప్ర‌జ‌లు రాక త‌గ్గిపోయింది. దీంతో కిబెరా ప్రాంతానికి చెందిన క్షుర‌కులు వినూత్న ఆలోచ‌న చేశారు. క‌రోనా వైర‌స్ ఆకృతిని స్ఫూర్తిగా తీసుకొని క‌రోనాకు ఉండే కొమ్ములు మాదిరిగానే జుట్టును ముళ్లు వేసి క‌ట్టి కొత్త హెయిర్‌స్టైల్‌ను రూపొందించారు.  ఇది దేశ‌వ్యాప్తంగా ఫ్యాష‌న్‌గా మారింది. ముందే ఆఫ్రికా వాసులు జుట్టును ముళ్లు ముళ్లుగా వేసి చిత్ర‌విచిత్రంగా హెయిర్‌స్టైల్ చేస్తుంటారు. ఇప్పుడు క‌రోనా కొమ్ముల స్టైల్ వారికి తెగ న‌చ్చేసింది. ఈ హెయిర్‌స్టైల్ ధ‌ర కూడా అన్నింటికి కంటే త‌క్కువ ధ‌ర‌కే వేస్తున్నారు క్షౌర‌కులు. దీంతో ప్ర‌జ‌లు క్షౌర‌శాల‌ల వ‌ద్ద క్యూ క‌ట్టారు. మొత్తంగా అక్క‌డ  క‌రోనాతో ఆదాయం..ఇత‌ర దేశాల్లో అగ‌మ్య‌గోచ‌రం..!

No comments:

Post a Comment