Wednesday, May 27, 2020

మ‌ళ్లీ చ‌నిపోతున్న గ‌బ్బిలాలు..స్థానికుల్లో ఆందోళ‌న‌

ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ (Uttar Pradesh)
భారీ సంఖ్య‌లో గ‌బ్బిలాలు చ‌నిపోవ‌డంతో ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ లోని బేల్‌ఘాట్ గ్రామంలో స్థానిక ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న  మొద‌లైంది. ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తోన్న క‌రోనా మ‌హమ్మారి గ‌బ్బిలాల కార‌ణం గాను వ్యాపించింద‌న్న ప్ర‌చారం నేప‌థ్యంలో గ‌బ్బిలాలు మృత్యువాత ప‌డ‌టం తీవ్ర అల‌జ‌డిని రేపుతోంది. 
అవి క‌రోనా వైర‌స్ వ‌ల్లే చ‌నిపోయాయ‌న్న ఉద్ధేశ్యంలో ఆ గ్రామంలోని ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు రేకెత్తాయి. అయితే గ‌బ్బిలాలు అధిక ఉష్ణోగ్ర‌త‌, తాగేందుకు నీరు దొర‌క్క‌పోవ‌డంతోనే గ‌బ్బిలాలు చ‌నిపోయి ఉండొచ్చ‌ని అట‌వీ శాఖా అధికారులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే చ‌నిపో యిన గ‌బ్బిలాల‌ను బైరెల్లీలోని భార‌త జంతు ప‌రిశోధ‌న సంస్థ‌కు పంపించామ‌ని, నివేదిక వ‌చ్చిన త‌ర్వాత గ‌బ్బిలాల మృతికి గ‌ల కార‌ణాల‌పై స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని అధికారులు పేర్కొన్నారు.
గ‌బ్బిలాల గురించి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు చ‌ద‌వండి..!

  •  గ‌బ్బిలం(Bat) అనేది ఒక క్షీర‌దం. సూర్తాస్త‌మ‌యం కాగానే ఇళ్ల‌లోంచి, చెట్ల గుబుర్ల లోంచి, బ‌య‌టికి వ‌చ్చి గ‌బ్బిలాలు అతి వేగంతో ఎగురుతూ చ‌ట‌క్కున ఏదో జ్ఞాప‌కం వ‌చ్చిన‌ట్లు ప‌క్క‌కి తిరిగిపోతూ ఉండ‌టం మ‌నం గ‌మ‌నిస్తూనే ఉంటాం.
  • అవి ఎగురుతున్న పురుగుల‌ను పెద్ద సంఖ్య‌లో ఫ‌ల‌హారం చేసేస్తూ ఉంటాయి. క‌టిక చీక‌ట్లో కూడా అడ్డంకుల‌ను సునాయాసంగా త‌ప్పించుకుని కంటికి క‌నిపించ‌క పోయినా పురుగుల్ని ప‌ట్టుకొని తింటూ ఉంటాయి. గ‌బ్బిలాలు చాలా విచిత్రమైన జీవులు. 
  • చీక‌ట్లో ఎగ‌ర‌డం ఒక్క‌టే కాదు. వీటి ప్ర‌త్యేక‌త ఏమిటంటే..? ఇవి ప‌క్షులు కావు, క్షీర‌దా జంతువులు. ఇవి గ్రుడ్ల‌ను పెట్ట‌వు. పిల్ల‌ల‌ను కంటాయి. వీటికి పళ్ళు, చెవులు ఉంటాయి. క్షీర‌దాల‌లో ఎగ‌ర‌గ‌లిన‌ది ఒక్క గ‌బ్బిలం మాత్ర‌మే. 
  • ప్ర‌స్తుతం గ‌బ్బిలాలో 2000 వేల ర‌కాలు ఉన్నాయి. ఒక్క ధృవ‌ప్రాంతాల‌లో త‌ప్పించి, ఇవి అన్ని చోట్లా క‌నిపిస్తాయి. ఆరు అంగుళాల నుంచి ఆరు అడుగుల వ‌ర‌కు రెక్క‌ల నిడివి గ‌ల గ‌బ్బిలాలు ఉన్నాయి. వీటిలో చాలా బాగం పురుగుల్ని తింటాయి. ప‌క్షుల్ని తినేవి, చేప‌ల్ని ప‌ట్టేవి, ర‌క్తం త్రాగేవి కూడా ఉన్నాయి. 
  • క‌టిక చీక‌ట్లో కూడా చెట్ల‌కు, పుట్ట‌ల‌కు, స్థంభాల‌కు గుద్దుకోకుండా ఎలా ఎగ‌ర‌గ‌లుతున్నాయో చాలా కాలం వ‌ర‌కు శాస్త్ర‌వేత్త‌ల‌కు అర్థం కాలేదు. 
  • ఇది తెలుసుకోవడానికి ఒక ప‌రిశోధ‌న చేశారు శాస్త్ర‌వేత్త‌లు. ఒక పెద్ద గ‌దిలో అడ్డంగా కొన్ని తీగ‌ల‌ని క‌ట్టి, కొన్ని గ‌బ్బిలాల‌ని ప‌ట్టుకొని, వాటి క‌ళ్ల‌కు గంతలు క‌ట్టి, ఆ గ‌దిలో విడిచి పెట్టారు. అవి ఏ తీగ‌ల‌కైనా త‌గిలితే ఒక గంట మ్రోగేటట్టు అమ‌ర్చారు. ఒక్క తీగ‌కైనా త‌గ‌ల‌కుండా మామూలు వేగంతో అవి సునాయాసంగా తీగ‌ల మ‌ధ్య సందుల్లోంచి ఎగుర‌గ‌లిగాయి. అంటే క‌ళ్ళ‌తో చూడ‌కుండానే గ‌బ్బిలాలు దారి తెలుసుకుంటున్నాయి అని రుజువు అయింది. కానీ ఇది ఏలా సాధ్యం?
  • రెండోవ  ప‌రిశోధ‌న‌లో... గ‌బ్బిలాల క‌ళ్ళ‌కి గంత‌లు విప్పేసీ, చెవుల‌కు బిర‌డాలు పెట్టి, ఆ గ‌దిలో వ‌దిలిపెట్టారు. ఈ సారి అవి స‌రిగ్గా ఎగ‌ర‌లేక‌పోయాయి. మాటిమాటికీ తీగ‌ల‌కే కా, గోడ‌ల‌కి గుద్దుకోవ‌డం మొద‌లు పెట్టాయి.  మూడ‌వ సారి వాటి నోరు క‌ట్టేసి వ‌దిలిపెట్టారు. ఈ సారి కూడా అవి స‌రిగ్గా ఎగ‌ర‌లేక‌పోయాయి.  
  • దీనిని బ‌ట్టి గ‌బ్బిలం దారి ఏ విధంగా తెలుసుకుంటు ఉందో అర్థం అయ్యింది. అది ఎగురుతున్న‌ప్పుడు నోటితో స‌న్న‌ని కూత వేస్తుంది. ఆ కూత మామూలు శ‌బ్ధ త‌రంగాల క‌న్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీ క‌ల‌ది కావ‌డం చేత (సెకండుకి 45 వేల నుండి 50 వేల సార్లు) అది మ‌న చెవుల‌కి వినిపించ‌దు. ఈ హై ఫ్రీక్వెన్సీ శ‌బ్ధ త‌రంగాలు ఎదుట ఉన్న అడ్డంకుల‌కు త‌గిలి, ప్ర‌తిఫ‌లించి వెన‌క్కి తిరిగి వ‌చ్చి, గ‌బ్బిలం చెవుల‌కి త‌గులుతాయి. వీటి చెవులు బ‌హు సున్నిత‌మైన‌వి కావ‌డం చేత ప‌రావ‌ర్త‌నం చెంది తిరిగి వ‌చ్చిన అల్పాల్ప‌మైన శ‌బ్ధాల‌ను విని, ఎద‌ర‌నున్న అడ్డంకిని గుర్తించ గ‌లుతుతాయి. ఆ వ‌స్తువు స్థ‌రింగా ఉందో లేదో క‌దులుతోందో, క‌దిలితే ఏ దిశ‌లో ఎంత వేగంతో క‌దులుతుందో, క‌చ్చితంగా తెలుసుకోగ‌లుతాయి. 
ఇది చ‌ద‌వండి: నెక్ట్స్ టార్గెట్ తెలుగురాష్ట్రాలే

No comments:

Post a Comment