ఖమ్మం: ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ ఎమ్మెల్యేను సింగరేణి మండలం గుంపెల్ల గ్రామానికి చెందిన దివ్యాంగుడు బానోతు వీరన్న శుక్రవారం ఎమ్మెల్యేను కలిసేందుకు క్యాంప్ కార్యాలయానికి వచ్చాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ వీరన్న వద్ద కూర్చుని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తన గ్రామంలో తాను నివాసం నివాసముంటున్న తండాలో సిసి రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నట్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చాడు. స్పందించిన ఎమ్మెల్యే సిసి రోడ్లు వేసేందుకు త్వరలో నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బానోతు వీరన్న ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.

Post a Comment

Previous Post Next Post