చెరువులో మునిగి ముగ్గురు మృతి
భ‌ద్రాద్రి కొత్త‌గూడెం: ప్ర‌మాద‌వ‌శాత్తు చెరువులో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ హృద‌య విషాద‌క‌ర సంఘ‌ట‌న మంగ‌ళ‌వారం  భ‌ద్రాద్రికొత్త‌గూడెం జిల్లా బూర్గంప‌హాడ్ మండ‌ల ప‌రిధిలోని లక్ష్మీపురం గ్రామంలో చోటుచేసుకుంది. ల‌క్ష్మీపురం గ్రామానికి చెందిన న‌ల్ల‌మోతు అప్పారావు(45) త‌న కొడుకు తేజు(20), మేన‌ల్లుడు విన‌య్ (19) తో క‌లిసి మంగ‌ళ‌వారం పొలంలో కూర‌గాయ‌ల పంట‌కు పురుగుల మందు పిచికారీ చేశారు. అనంత‌రం ప‌క్క‌నే ఉన్న రేపాక చెరువులోకి కాళ్లు క‌డుక్కునేందుకు వెళ్లారు. ఈ క్ర‌మంలో తేజు చెరువులోకి దిగ‌గా కాలు జారీ మునిగిపోయాడు. తేజును కాపాడేందుకు విన‌య్ చెరువ‌లోకి దిగాడు. ఇద్ద‌రు మునిగిపోతుండ‌గా వారిని రక్షించేందుకు అప్పారావు చెరువులోకి దిగాడు. ఈ క్ర‌మంలో చెరువులో మునిగి ముగ్గురు మృతి చెందారు. గ్రామ ప్ర‌జ‌లు వీరి మృత‌దేహాల‌ను చెరువు నుంచి  వెలికితీశారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. వీరి మృతితో గ్రామంలో విషాధం అలుముకుంది. 
బాధిత కుటుంబాన్ని పిన‌పాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ప‌రామ‌ర్శించారు. బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన వారిలో ఎమ్మ‌ల్యేతో పాటు జ‌డ్‌పిటిసి కామిరెడ్డి శ్రీ‌ల‌త‌, కొండారెడ్డి, బిక్క‌సాని శ్రీ‌నివాస‌రావు, జ‌ల‌గం జ‌గ‌దీష్‌, శ్రీ‌హ‌రిబాబు, పాలెం దివాక‌ర్‌రెడ్డి చింతా వెంక‌ట్రామిరెడ్డి, రాజా త‌దిత‌రులు ఉన్నారు. 

Post a Comment

Previous Post Next Post