న్యూఢిల్లీ: త‌న భార్య‌తో హోంగార్డు అక్ర‌మ సంబంధం పెట్ట‌కున్నాడ‌నే అనుమానంతో ఓ వ్య‌క్తి అత‌నికి క‌రోనా నివార‌ణ‌కు మందు అంటూ..విషం ఇచ్చిన ఉదంతం ఢిల్లీలో వెలుగుచూసింది. ఢిల్లీలోని అలీపూర్ ప్రాంతంలో 42 ఏళ్ల ఓ వ్య‌క్తి త‌న భార్య‌తో ఓ హోంగార్డుకు అక్ర‌మ సంబంధం ఉంద‌ని అనుమానించాడు. ఎలాగైనా హోంగార్డుకు విషం తాగించి చంపాల‌ని అలీపూర్ ప్రాంత వాసి వ్యూహం ప‌న్నాడు. ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ను నియ‌మించి వారిని ఆర్యోగ కార్య‌క‌ర్త‌లుగా న‌టించ‌మ‌ని కోరాడు. అలీపూర్ ప్రాంత వాసి తాను నియ‌మించుకున్న మ‌హిళ‌ల ద్వ‌రా హోంగార్డుతో పాటు అత‌ని ముగ్గురు కుటుంబ‌స‌భ్యుల‌కు క‌రోనా నివార‌ణ‌కు మందు అంటూ.. విషం తాగించారు. అనారోగ్యానికి గురైన న‌లుగురిని వెంట‌నే ఆసుపత్రికి త‌ర‌లించి చికిత్స చేశారు. హోంగార్డు కుటుంబానికి విషం ఇచ్చిన మ‌హిళ‌ల‌ను సీసీటీవీ పుటేజీ స‌హాయంతో ప‌ట్టుకొని ప్ర‌శ్నిస్తే అస‌లు సూత్ర‌ధారి అలీపూర్ ప్రాంత వాసి అని తేలింది. కేవ‌లం త‌న భార్య‌తో హోంగార్డుకు అక్ర‌మ సంబంధం ఉంద‌నే అనుమానంతోనే అత‌న్ని చంపేందుకు య‌త్నించిన అలీపూర్ వాసితోపాటు ఇద్ద‌రు మ‌హిళ‌ల‌పై హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదు చేసి అరెస్టు చేశామ‌ని ఢిల్లీ పోలీసులు చెప్పారు. 

Post a Comment

Previous Post Next Post