న్యూఢిల్లీ: జూన్ 1వ తారీకు నుంచి 200 సాధారణ రైళ్లు నడవనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ప్రస్తుతానికి నాన్ ఏసీ రైలు మాత్రమే నడుస్తాయని స్పష్టం చేసింది. రిజర్వేషన్ చేయించుకున్న వారికి మాత్రమే రైలు ప్రయాణాలకు అనుమతి ఉంటుందని పేర్కొంది. కౌంటర్ల ద్వారా టిక్కెట్టు తీసుకునే వెసులుబాటు లేదని తేల్చి చెప్పింది. వీటితోపాటు వలస కార్మికులు తరలించేందుకు ప్రతిరోజు 200 శ్రామిక్ రైళ్లు నడపనున్నారు. రైళ్లకు సంబంధించిన సమయ పట్టికను త్వరలో విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఏఏ మార్గాల్లో రైళ్ళు నడుస్తాయన్న విషయాలు వెల్లడించనప్పటికి చిన్న పట్టణాలు, నగరాల్లో నడిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post