ఖ‌మ్మం: జిల్లాలో మ‌ధిర మండ‌లం మ‌హాదేవ‌పురం గ్రామంలో క‌రోనా కేసు ఒక‌టి న‌మోదైంది. జిల్లా వైద్య‌శాఖ అధికారులు ఈ విష‌యాన్ని అధికారికంగా దృవీక‌రించారు. అయితే ఈ వ్య‌క్తి  ఇటీవ‌ల ముంబాయి నుండి వ‌చ్చిన వారిలో ఒక‌ర‌ని తెలుస్తోంది. ఆదివారం అర్ధ‌రాత్రి  ఆ వ్య‌క్తిని  హైద‌రాబాద్ గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.  గ్రామంలో ప‌ర్య‌వేక్ష‌ణ చేయ‌వ‌ల్సిన దెందుకూరు డాక్ట‌ర్ వారం నుంచి అందుబాటులో లేక‌పోవ‌డంతో  జిల్లా ఉన్న‌తాధికారులు మాటూరు పేట డాక్ట‌ర్ శ్రీ‌నివాస్‌ను పంపి కేసులు ప‌రిశీలిస్తున్నారు. ఇంకా పాజిటివ్ కేసులు పెరిగే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌జ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ, గ్రామంలో మెడిక‌ల్ క్యాంపు పెట్ట‌వ‌ల‌సిందిగా విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. మొత్తంగా క‌రోనా కేసు న‌మోదు కావ‌డంతో జిల్లాలో అధికారులు మ‌రింత అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.

Post a Comment

Previous Post Next Post