Friday, May 29, 2020

కీల‌క తీర్పు: ర‌మేష్‌కుమార్‌ను తీసుకోండి:హైక్టోర్టు

అమ‌రావ‌తి:
రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ తొల‌గింపు వ్య‌వ‌హారంపై ఏపీ హైక్టోర్టు కీల‌క తీర్పు వెలువ‌రించింది. ఏపీ ప్ర‌బుత్వం జారీ చేసిన జీవోల‌న్నీ ర‌ద్దు చేసిన ఉన్న‌త న్యాయ‌స్థానం..ర‌మేష్‌కుమార్‌ను రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా తిరిగి నియ‌మించాల‌ని శుక్ర‌వారం ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఈసీ విష‌యంలో నిబంధ‌న‌లు మారుస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌ను ధ‌ర్మాస‌నం కొట్టివేసింది. ఆర్టిక‌ల్ 213 ప్ర‌కారం ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఆర్డ‌నెన్స్ ఇచ్చే అధికారం రాష్ట్ర ప్ర‌భుత్వానికి లేద‌ని హైకోర్టు స్ప‌ష్టం చేసింది. ఈ క్ష‌ణం నుంచి ర‌మేష్‌కుమార్ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా కొన‌సాగుతార‌ని ఆదేశాలు జారీ చేసింది. 
హైకోర్టు తీర్పు వెల్ల‌డించిన అనంత‌రం న్యాయ‌వాది జంధ్యాల ర‌విశంక‌ర్ మీడియాతో మాట్లాడుతూ..ఈ క్ష‌ణం నుంచి నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్  ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్‌గా కొన‌సాగుతార‌ని తెలిపారు. ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా క‌న‌గ‌రాజు కొన‌సాగ‌డానికి వీల్లేద‌ని పేర్కొన్నారు. ఆర్డ‌నెన్స్ ర‌ద్దు కావ‌డంతో నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్ ఎస్ఈసీగా ఉన్న‌ట్టేన‌ని వివ‌రించారు. 
హైకోర్టులో గ‌త‌ విచార‌ణలో జ‌రిగిన కొన్ని వివ‌రాలు...
ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ తొల‌గింపును స‌వాల్ చేస్తూ వేసిన పిటిష‌న్‌పై ఏపీ హైకోర్టులో గ‌త శుక్ర‌వారం (22.5.2020) హైకోర్టులో వాద‌న‌లు ముగిసాయి. ఇరుప‌క్షాల వాద‌న‌ల‌ను విన్న న్యాయ‌స్థానం తీర్పును రిజ‌ర్వులో ఉంచింది. రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ త‌ర‌పున న్యాయ‌వాది రాత‌పూర్వ‌క వాద‌న‌ల‌ను సోమ‌వారం లోపు దాఖ‌లు చేయాల‌ని హైకోర్టు ఆదేశించింది. 
నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ తో పాటు పిటిష‌న్ల‌ను వేసిన 12 మంది, అదేవిధంగా ప్ర‌భుత్వం త‌ర‌పున వాద‌న‌లను కూడా  శుక్ర‌వారం కొన‌సాగాయి. ప్ర‌భుత్వం త‌ర‌పున ఏజీ వాదిస్తూ...రాజ్యాంగంలోని 243కే అధికారంలో ప‌ద‌వీ  కాలానికి ర‌క్ష‌ణ ప్ర‌స్తావ‌న లేద‌ని వాదించారు. ఎన్నిక‌ల సంస్క‌ర‌ణ‌లో భాగంగానే కొత్త ఆర్డినెన్స్‌ను తెచ్చామ‌న్నారు. నిస్ఫాక్షికంగా ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌నేదే ప్ర‌భుత్వ ఉద్ధేశ‌మ‌న్నారు. క్ష‌క్ష సాధింపుతో ప‌ద‌వీ కాలాన్ని కుదించామ‌న్న పిటిష‌న‌ర్ల వాద‌న‌ల్లో వాస్త‌వం లేద‌న్నారు. నూత‌న ఆర్డినెన్స్ ప్ర‌కారం నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ప‌ద‌వీ కాలం ముగిసినందునే నూత‌న ఎస్ఈసీని నియ‌మించామ‌నీ, ప్ర‌భుత్వానికి ఆ అధికారం ఉంద‌ని కోర్ట‌కు తెలిపారు. 
ప్ర‌భుత్వం త‌ర‌పున వాద‌న‌లు ముగిసిన అనంత‌రం పిటిష‌న‌ర్ త‌ర‌పు న్యాయ‌వాదులు అందులో ఉన్న అభ్యంతారాల‌పై త‌మ వాద‌న‌లు వినిపించారు. రాజ్యాంగ అధిక‌ర‌ణ 243కె ప్ర‌కారం ఎస్ఈసీ స‌ర్వీసుతో పాటు, ప‌ద‌వీ కాలానికి కూడా ర‌క్ష‌ణ ఉంద‌ని కోర్టుకు తెలిపారు. నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్ ను ఆ అధిక‌ర‌ణ ప్ర‌కార‌మే నియ‌మించార‌ని తెలిపారు. దీని ప్ర‌కారం ఆయ‌న‌కు ఐదు సంవ‌త్స‌రాల ప‌ద‌వీకాలం ఉంటుంద‌ని పేర్కొన్నారు. ప్రస్తుతం తెచ్చిన ఆర్డినెన్స్ ఆయ‌న‌కు వ‌ర్తించ‌ద‌ని పిటిష‌న‌ర్ త‌ర‌పు న్యాయ‌వాది కోర్టుకు తెలిపారు. పిటిష‌న‌ర్ మాజీ మంత్రి కామినేని శ్రీ‌నివాస్ త‌ర‌పున సీనియ‌ర్ న్యాయ‌వాది జంధ్యాల  ర‌విశంక‌ర్ వాద‌న‌లు వినిపించారు. పార్ల‌మెంట్ ఇచ్చిన టాస్క్‌ఫోర్స్ నిబంధ‌న‌ల ప్ర‌కారం నియామ‌కం జ‌ర‌గ‌లేద‌ని, నిష్పాక్షిక ఎన్నిక‌ల కోసం నూత‌న ఆర్డినెన్స్ తీసుకువ‌చ్చ‌మాని ప్ర‌భుత్వ వాద‌న‌లో వాస్తవం లేద‌న్నారు. 

No comments:

Post a Comment