ర‌వాణా శాఖ అధికారికి యూనియ‌న్ విన‌తి
ఖ‌మ్మం: ఖ‌మ్మం జిల్లా  ర‌వాణాశాఖ అధికారి కిష‌న్‌రావుకు గురువారం ఖ‌మ్మం జిల్లా ఆటో యూనియ‌న్ జెఏసీ విన‌తిప‌త్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా జెఏసీ నాయ‌కులు మాట్లాడుతూ..క‌రోనా వైర‌స్ వ‌ల్ల కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు సూచ‌న మేర‌కు ఆటో  కార్మికులు ఇంటి నుండి బ‌య‌ట‌కు రాలేని ప‌రిస్థితి నెల‌కొన‌డంతో కార్మికులు ఆర్థికంగా తీవ్రంగా న‌ష్ట‌పోయార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆటోల‌ను బ్యాంక్ మ‌రియు ప్రైవేటు ఫైనాన్స్ ల‌లో తీసుకున్న ఆటో కార్మికుల‌ను కిస్తీలు క‌ట్టాల‌ని ఒత్తిడి తెచ్చి ఇబ్బందుల‌కు గురిచేస్తున్నార‌ని విన్న‌వించుకున్నారు. కావున క‌నీసం 6 నెల‌లు గ‌డువు ఇప్పించాల‌ని క‌రోనా వ‌ల్ల 3 నెల‌ల లాక్‌డౌన్ సడ‌లింపులో భాగంగా ఆటోలో డ్రైవ‌ర్‌తో పాటు ఇద్ద‌రు ప్యాసింజ‌ర్లు మాత్ర‌మే ఉండాల‌ని ప్ర‌భుత్వం పెట్టిన నిబంధ‌న ప్ర‌కారం ఆటో కార్మికుల‌కు ఆర్థికంగా న‌ష్ట‌పోతున్నార‌ని తెలిపారు. కావున ఖ‌మ్మం న‌గ‌రంలో ఉన్న రూ.15 ఛార్జీని తాత్కాలికంగా రూ.20  ఛార్జీగా పెంచుతున్నామ‌ని జెఏసీ నాయ‌కులు విన‌తిప‌త్రం అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో టిఆర్ ఎస్‌కెవి టీఏటియు జిల్లా అధ్య‌క్షులు పాల్వంచ కృష్ణ‌, సిఐటియు నాయ‌కులు ఉపేంద‌ర్‌, ఏఐటియు నాయ‌కులు మోహ‌న్‌రావు, ఇఫ్టూ నాయ‌కులు ల‌క్ష్మీ నారాయ‌ణ‌, ఐఎన్‌టియుసి నాయ‌కులు ప్ర‌సాద్‌, టిఆర్ ఎస్‌కెవి టిఎటియు న‌గ‌ర అధ్య‌క్షులు ఎస్‌కె.స‌త్తార‌, వీర‌భ‌ద్రం పాల్గొన్నారు. 

Post a Comment

Previous Post Next Post