హైద‌రాబాద్ః తెలంగాణ రాష్ట్రంలో కొత్త‌గా మ‌రో 42 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఇందులో అత్య‌ధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 37 కాగా, రంగారెడ్డి జిల్లాలో 2, ఇత‌ర రాష్ట్రాల నుంచి ఇక్క‌డికి  వ‌చ్చిన వ‌ల‌స జీవుల కేసులు 2 న‌మోద‌య్యాయి. దీంతో వ‌ల‌స‌ల్లో పాజిటివ్ కేసుల సంఖ్య 57కు పెరిగింది. మొత్తంగా రాష్ట్రంలో ఆదివారం నాటికి క‌రోనా బాధితుల సంఖ్య 1551 కి చేరుకుంది. ప్ర‌స్తుతం ఆసుప్ర‌త్తుల్లో 525 మంది చికిత్స పొందుతుండ‌గా..ఆదివారం మ‌రో 42 మంది ఆసుప‌త్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఆరోగ్య‌వంతులుగా ఇళ్ల‌కెళ్లిన వారి సంఖ్య 992 కు చేరింది. ఇప్ప‌టివ‌ర‌కూ మ‌హ‌మ్మారి బారిన‌ప‌డి 34 మంది మ‌ర‌ణించారు. రాష్ట్రంలో క‌రోనా కేసులు ఒక్క‌టి కూడా న‌మోదు కానీ జిల్లాలు వ‌రంగ‌ల్ గ్రామీణ‌, యాదాద్రి భువ‌న‌గిరి, వ‌న‌ప‌ర్తి కాగా, గ‌త 14 రోజులుగా పాజిటివ్ కేసులు న‌మోదవ‌ని జిల్లాలు 25 ఉన్నాయి. పెద్ద‌సంఖ్య‌లో ఇత‌ర ప్రాంతాల నుంచి అనేక మంది వ‌ల‌స‌లు వ‌స్తుండ‌టంతో ప్ర‌భుత్వం వారిని ప‌రీక్షించ‌డానికి అన్ని చ‌ర్య‌లు తీసుకుంద‌ని ప్ర‌జారోగ్య సంచాల‌కులు డాక్ట‌ర్ జి.శ్రీనివాస‌రావు తెలిపారు.
పురుషులే అధికం...
రాష్ట్రంలో ఈ నెల 16 నాటికి 23,388 న‌మూనాల‌ను క‌రోనా నిర్థార‌ణ కోసం ప‌రీక్షించారు. ఇందులో పురుషుల‌వి 15203 కాగా, వీటిల్లో 947 మందిలో క‌రోనా పాజిటివ్ గా తేలింది. మ‌హిళ‌ల్లో 8185 నమూనాల‌ను ప‌రీక్షించ‌గా, 566 మందిలో వైర‌స్‌ను నిర్థారించారు. వ‌య‌స్సుల వారీగా ప‌రిశీలించినా.. మ‌హిళ‌ల కంటే పురుషుల్లో ఎక్క‌వ మంది పాజిటివ్‌లుగా నిర్థార‌ణ అయ్యింది. 
మొత్తం కేసులు:1551
డిశ్చార్జి అయిన‌వారు :992
చికిత్స పొందుతున్న‌వారు :525
మ‌ర‌ణాలు :34 

Post a Comment

Previous Post Next Post