Friday, May 29, 2020

వైసీపీకి షాక్ : కె.ఎస్.ఆర్ ‌తో స‌హా మ‌రో 44 మందికి హైకోర్టు నోటీసులు..!

అమ‌రావ‌తి:
న్యాయ‌మూర్తుల‌పై సామాజిక మాధ్య‌మాల్లో అనుచిత వ్యాఖ్య‌ల అంశంపై శుక్ర‌వారం హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో మ‌రో 44 మందికి ఉన్న‌త న్యాయ‌స్థానం నోటీసులు జారీ చేసింది. సామాజిక మాధ్య‌మాల్లో అనుచిత వ్యాఖ్య‌లు చేసిన పాత్రికేయులు కొమ్మినేని శ్రీ‌నివాస‌రావు,ప్ర‌సాద్‌రెడ్డికి, అమెరికాకు చెందిన డా.పంచ్ ప్ర‌భాక‌ర్, వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమ‌ర‌నాథ్ తో స‌హా 44 మందికి నోటీసులు జారీ చేయాల‌ని న్యాయ‌స్థానం ఆదేశించింది. ఇదే కేసులో రెండ్రోజుల కింద‌ట 49 మందికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. త‌దుప‌రి విచార‌ణ‌ను మూడు వారాల పాటు వాయిదా వేసింది. అనుచిత వ్యాఖ్య‌లు చేసిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హైకోర్టు రిజిస్ట్రార్ పిటిష‌న్ దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేర‌కు సీఐడీ అధికారులు రంగంలోకి దిగారు. కోర్టుల‌ను కించ‌ప‌రిచే వ్యాఖ్య‌లు చేసిన ప‌లువురిని ఇప్ప‌టికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

No comments:

Post a Comment