Friday, May 22, 2020

43వ కార్పోరేట‌ర్ ఆధ్వ‌ర్యంలో 60 క్వింటాళ్ల కూర‌గాయ‌లు పంపిణీ

ఖ‌మ్మం: న‌గ‌రంలోని 43వ డివిజ‌న్ కార్పోరేట‌ర్ య‌ర్రా శైల‌జ‌, గోపీ ఆధ్వ‌ర్యంలో స్థానిక బోస్ సెంట‌ర్ నందు శుక్ర‌వారం 60 క్వింటాళ్ల కూర‌గాయ‌లు స్థానికులకు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా య‌ర్రా శైల‌జ మాట్లాడుతూ..లాక్‌డౌన్ వ‌ల్ల పేద ప్ర‌జ‌ల బాధ‌లు ఇంకా ఎక్కువ‌ య్యాయ‌ని, వారికి స‌హాయం చేయాల‌నే ఆలోచ‌న‌తో లాక్‌డౌన్ ప్రారంభం నుండి అనేక ర‌కాల కార్య‌క్ర‌మాల ద్వారా నిత్య‌వ‌స‌ర స‌రుకులు పంపిణీ చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. పేద‌వారికి స‌హాయం చేసేందుకు ప్ర‌తిఒక్క‌రూ  ముందుకు వ‌చ్చి వారికి స‌హాయం చేయాల‌ని కోరారు.  ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా  ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఈసీ మెంబ‌ర్ సోమార‌పు సుధీర్ తో పాటు మ‌ల్లీడు వ‌రుణ్ చౌద‌రి, కెపిశ్రీ‌ను, సీపీఎం క‌మిటీ స‌భ్యులు య‌ర్రా మ‌ల్లికార్జున్‌, ఆవుల శ్రీ‌ను, బొమ్మ‌కంటి పాపారావు, బొమ్మ‌కంటి అయ్య‌ప్ప‌, అన్వేష్‌, మ‌స్తాన్‌, న‌వీన్ తుర‌క శ్రీ‌ను, న‌ర్రా రాజేష్‌, సురేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment