Monday, May 18, 2020

లాక్‌డౌన్ 4.0 మార్గ‌ద‌ర్శ‌కాలు తెలుసుకోండి..!

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ పొడిగింపుపై కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. లాక్‌డౌన్‌ను మే 31 వ‌ర‌కు పొడిగిస్తూ ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకున్న కేంద్రం అందుకు సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను తాజాగా విడుద‌ల చేసింది.
  •  మే 31 వ‌ర‌కూ మెట్రో, విమాన సేవ‌లు అందుబాటులో ఉండ‌వ‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది.
  • క‌రోనా హాట్‌స్పాట్స్‌లో ఆంక్ష‌లు మ‌రింత క‌ఠినంగా అమ‌లు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.
  • పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌లు, కోచింగ్ సెంట‌ర్లు మే 31 వ‌ర‌కూ మూసివేసే ఉంటాయ‌ని స్ప‌ష్టం చేసింది.
  • హోట‌ళ్లు, రెస్టారెంట్లు  మే 31 వ‌ర‌కూ తెరిచేందుకు అనుమ‌తి లేద‌ని కేంద్రం తేల్చి చెప్పింది.
  • సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ జిమ్ సెంట‌ర్లు, స్విమ్మింగ్ ఫూల్స్ బార్లు, ఆడిటోరియంలు, అసెంబ్లీ హాల్స్‌, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు మే 31 వ‌ర‌కూ తెరిచే ప‌రిస్థితి లేద‌ని కేంద్రం ప్ర‌క‌టించింది.
  • మే 31 వ‌ర‌కూ ప్ర‌తిరోజూ రాత్రి 7 గంట‌ల నుంచి ఉద‌యం 7 గంట‌ల వ‌ర‌కూ క‌ర్ప్యూ కొన‌సాగుతుంద‌ని తెలిపింది. 
  • కంటైన్మెంట్‌, రెడ్‌,గ్రీన్, ఆరెంజ్ జోన్ల‌పై  రాష్ట్రాల‌దే అధికారం అని కేంద్రం స్ప‌ష్టం చేసింది.
  • రాష్ట్రాల ప‌ర‌స్ప‌ర అనుమ‌తితో ప్ర‌జార‌వాణా వెసులుబాటును కేంద్ర ప్ర‌భుత్వం క‌ల్పించింది.
  • అన్ని ర‌కాల మ‌త‌ప‌ర‌మైన కార్య‌క్ర‌మాల‌పై నిషేధం కొన‌సాగుతుంద‌ని పేర్కొంది.
  • రెస్టారెంట్ల‌కు హోం డెలివ‌రీ అందించేందుకు మాత్ర‌మే వెసులుబాటును క‌ల్పిస్తున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

No comments:

Post a Comment